Advertisementt

ఒక్క నయీంలో ఇన్ని కోణాలా... !

Thu 18th Aug 2016 10:12 AM
nayim,nayim gang,nayim encounter,don,villain,hero,politiciens,police  ఒక్క  నయీంలో ఇన్ని కోణాలా... !
ఒక్క నయీంలో ఇన్ని కోణాలా... !
Advertisement

సినిమాలో  హీరోయిజం ఎలివేట్ కావాలంటే అందులో విలన్ బలవంతుడై ఉండాలి.  ఏ సినిమాలో అయినా విలన్ ఎంత బలవంతమైన ప్రయాగాలు చేస్తాడో వాటన్నింటినీ ఎదుర్కొనే  హీరోకి ఆ సినిమా గొప్ప పేరు, ఇమేజ్ తెచ్చిపెడుతుంది అంతే.... అంటే సొసైటీలో హీరోలు ఉండాలి. విలన్ లు ఉండాలి. విలన్ లు అంటే అట్టాంటిట్టాంటి విలన్ లు కాదు. దుమ్మురేగి పోయే... కళ్ళు చెదిరిపోయే ....  భయంరేగిపోయే విలన్.... అతడే అయీముద్ధీన్ అలియాస్ నయీమ్. 

అసల  సమాజం పట్ల  నయీమ్ దృక్పథం ఏంటో ఎవరికీ అంతుపట్టడం లేదు. ఎందుకంటే నయీమ్ కు ఓ దృక్పథం అంటూ లేదు కాబట్టి. కానీ దృక్కోణాలు మాత్రం చాలా చాలా ఉన్నాయి. వెలికి తీసేకొద్ది ఆయనగారి పలు రకాల కోణాలు ఒక్కటొకటిగా మెల్లిగా బయటపడుతున్నాయి. తను వేసుకున్న బాటకు అడ్డువస్తే సొంత రక్త సంబంధికులనే కాదు ఎవరినైనా అడ్డంగా నరికే అదో అంతు పట్టని పాత్ర.  సొంత చెల్లి, బావనే కాదు తను వేసుకున్న బాటకు అడ్డు తిరిగే ఏ ఒక్కరూ బ్రతికి ఉంచిన పాపాన పోలేదు నయీమ్. ఇంకా తన అవసరాల కోసం పిల్లల్లతో కూడా అఘాయిత్యాలకు పాలు పడ్డాడు. అందుకు సాక్ష్యం ఎన్ కౌంటర్ తర్వాత నయీమ్ నివాసం మీద దాడి చేసినప్పుడు పెద్ద ఎత్తున పిల్లలు కనిపించడమే. పిల్లలపై నయీమ్ చేస్తున్న అఘాయిత్యాలకు తల్లి, చెల్లితో పాటు భార్య కూడా వత్తాసు పలికేవారంటే ఆయనంటే వారికెంత భయమో అర్థమౌతుంది.

ఈ నరహంతకుడు నయీమ్ కు బడా రాజకీయ నాయకులు కూడా తమ అవసరాలు తీర్చుకొనేందుకు వత్తాసు పలికి మరీ అఘాయిత్యాలు చేయించారు. నిత్యం అరాచకాలు, అక్రమాలతో ప్రపంచాన్నే దున్నేశాడు. భూకబ్జాలతో పాటు రాజకీయ నేతలను, సినీ పరిశ్రమలో ప్రముఖులను, హీరోయిన్లతో సహా అందరినీ బెదిరించి మరీ  భారీ స్థాయిలో అక్రమ సామ్రాజ్యాన్ని సృష్టించుకున్నాడు. తీగ కదిలిస్తే డొంకంతా కదిలినట్టు నయీమ్ మరణం తర్వాత వీరి నేర సామ్రాజ్యం ఒక్కొక్కటి బయటపడుతుంది. ఒక్క తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా దేశంలోని పలు రాష్ట్రాల్లో వారి అక్రమాలను విస్తరించుకున్నాడు. నిజంగా అతను ఓ పైశాచికమైన ఆనందంతో మానవరూపంలోని ఓ మృగం లా సమాజంలో సంచరించి రాక్షసుడులా అఘాయిత్యాలకు తెగబడ్డాడని చెప్పవచ్చు. 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement