క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ తాజాగా 'నక్షత్రం' సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో సందీప్ కిషన్ హీరో గా నటిస్తున్నాడు. ఈ సినిమా గురించి రోజుకో న్యూస్ బయటికి వస్తుంది. ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ గెస్ట్ రోల్ లో నటిస్తున్నాడని స్వయం గా కృష్ణ వంశీనే సోషల్ మీడియా లో తెలియపరిచారు. ఈ సినిమాలో సాయి పవర్ ఫుల్ పోలీసు పాత్రలో నటిస్తున్నాడని సమాచారం. ఈ పాత్ర దాదాపు 20 నిముషాలు పాటు 'నక్షత్రం' సినిమాలో ప్రేక్షకులను అలరిస్తుందని సమాచారం. ఇంకో విషయం ఇప్పుడు ఫిలిం నగర్ సర్కిల్స్ లో హల్ చల్ చేస్తుంది. అదేమిటంటే 'కంచె' సినిమాలో నటించిన ప్రగ్య జైస్వాల్ కూడా 'నక్షత్రం' సినిమాలో ఒక గెస్ట్ రోల్ లో నటిస్తుందని తాజా సమాచారం. అయితే ప్రగ్య కూడా ఈ సినిమాలో పోలీస్ గెటప్ లోనే నటిస్తోందట. పోలీస్ పాత్రలో ఎలా నటించాలో ప్రగ్యాకి కృష్ణ వంశీ ట్రైనింగ్ కూడా ఇప్పిస్తున్నాడట. ఇక ఈ ట్రైనింగ్ లో ప్రగ్య కొన్ని ఫైటింగ్స్ కూడా నేర్చుకుంటుందట. అయితే ఈ ఫైట్స్ నేర్చుకోవడానికి ప్రగ్య ని కృష్ణ వంశీ చాలా కష్టపెడుతున్నాడట. ఈ విషయాన్ని ప్రగ్య తన ప్రెండ్స్ దగ్గర గొప్పగా చెప్పుకుంటుందని సమాచారం. ఇంకా ఈ సినిమాలో విలన్ పాత్రలో టాలీవుడ్ హీరో తనీష్ నటిస్తున్నాడని అందరికి తెలిసిందే.