ఒకప్పుడు కామెడీ అంటే బ్రహ్మానందం... బ్రహ్మానందం అంటే కామెడీ అనే టైప్ లో టాలీవుడ్ పరిస్థితి ఉండేది. ఇక ఇప్పుడు ఈటీవీ పుణ్యమా అని జబర్దస్త్ ప్రోగ్రాం వచ్చాక అందరూ కమెడియన్స్ అయిపోతున్నారు. ఇక బ్రహ్మానందం ని పెద్దగా సినిమాల్లోకి తీసుకోవడం మానేశారు. అప్పటి టాలీవుడ్ డైరెక్టర్స్ అయితే వాళ్ళ సినిమాలలో బ్రహ్మానందం కి ప్రత్యేకం గా ఒక పాత్రను రాసుకుని ఉంచేవారు. ఇప్పుడిక ఆ పరిస్థితి లేదు. బ్రహ్మానందం సీనియర్ కమెడియన్.. అందుకే ఏదైనా సినిమాలో నటించాలి అంటే రోజు కి 4 నుండి 5 లక్షల దాకా డిమాండ్ చేస్తున్నాడని... అందుకే ఆయనకి అంత పెద్ద మొత్తం ఇచ్చే బదులు ఏదైనా చిన్న వారితో కామెడీ చేయించేద్దాం అని డిసైడ్ అయిపోయారు ఇప్పటి టాలీవుడ్ డైరెక్టర్స్. దీంతో బ్రహ్మానందం సినిమాల్లేక కొంత కాలంగా ఖాళీగా ఉండేలా చేసేశారు. చిన్న చితక సినిమాలలో అప్పుడప్పుడు కనిపిస్తున్న బ్రహ్మానందం తాజాగా వెంకీ తో చేసిన 'బాబు బంగారం' సినిమాలోని కామెడీ కూడా పెద్దగా వర్కౌట్ కాలేదు. ఆ సినిమా పరిస్థితి అలా ఉంటే ఇపుడు రాబోయే సినిమా 'ఆటాడుకుందాం రా' బ్రహ్మానందం కి అగ్ని పరీక్ష కానుంది. ఈ సినిమాలో కామెడీ ఎలా చేస్తాడు? ఈ సినిమాలో కూడా బ్రహ్మానందం కామెడీ వర్కౌట్ అవ్వకపోతే.. రాబోయే సినిమాలకు అస్సలు బ్రహ్మనందం ని తీసుకోరేమో! అనే సందేహాలు ఇండస్ట్రీ లో వినిపిస్తున్నాయి. మరి బ్రహ్మి భవిష్యత్ తెలియాలంటే ఆగష్టు 19 వరకు వేచి చూడాల్సిందే.