Advertisementt

ఎట్టకేలకు ఈ జంట ఒక్కటవుతున్నారు..!

Wed 17th Aug 2016 07:27 PM
yash radhika pandit,yash and radhika pandit engagement,kannada film stars  ఎట్టకేలకు ఈ జంట ఒక్కటవుతున్నారు..!
ఎట్టకేలకు ఈ జంట ఒక్కటవుతున్నారు..!
Advertisement
Ads by CJ

చాలా కాలంగా కన్నడ హీరో యాశ్- హీరోయిన్ రాధికాపండిట్‌ల  మధ్య ప్రేమ పుకార్లుగా వినిపిస్తున్న విషయం తెలిసిందే. కాగా ఈ పుకార్లు విపరీతంగా ఎక్కువై షికార్లు చేస్తుండటంతో ఏదో ఒకటి తేల్చేసుకుందామనుకున్నట్లుంది ఆ జంట. మొత్తానికి ఆ జంట ఇరు కుటుంబ సభ్యులను ఒప్పించి ప్రేమ ఫలించింది అన్నట్లుగా అమ్మయ్య అంటూ ఒక్కటై పోయింది. అందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఈ జంట నిశ్చితార్థం రహస్యంగా  గోవాలో జరిపేసుకున్నారు. ఇక వివాహం ఒక్కటే మిలిగిపోయింది.

శాండిల్‌వుడ్‌లో తమకంటూ ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు యాష్.. రాధికా పండిత్ లు. ఈ నటీనటులిద్దరూ కూడా ఎనిమిదేళ్లుగా చిత్ర పరిశ్రమలో రాణిస్తున్నారు.  కన్నడ చిత్రసీమలో వీరిద్దరూ కలిసి నటించిన సినిమాలే చాలా ఉన్నాయి. ఆ  రకంగా వీరిద్దరూ మంచి ఇమేజ్‌ని క్రియేట్ చేసుకున్నారు. దాంతో ఇద్దరి మధ్య ఉన్న స్నేహం కాస్తా ప్రేమగా మారి ఇప్పుడు అది ఫలించిందనే చెప్పాలి. ప్రేమ ఫలించడం అంటే పెద్దవాళ్ళని ఒప్పించడంలోనే ఉంటుంది.

ఆ రకంగా ఇన్నాళ్ళ నుండి పరిశ్రమలో వారిద్దరి గురించీ గాసిప్పులు రాసుకున్న రచయితలంతా అవాక్కయ్యారు. గోవాలో ఇద్దరూ రహస్యంగా నిశ్చితార్థం కూడా జరిపేసుకున్నారని తెలియగానే కన్నడ చిత్రసీమ అంతా ఆశ్చర్యానందంతో మునిగి తేలింది.  కాగా రాధికా మీడియాతో మాట్లాడుతూ మా ఫ్యామిలీ అంతా  ఇప్పుడు గోవాలో వుంది, అందుకే ఇక్కడే నిశ్చితార్థం జరుపుకోవాల్సివచ్చిందని చెప్పిందీ ముద్దుగుమ్మ. కాగా ఈ జంట నిశ్చితార్థానికి శాండల్‌వుడ్‌, కోలీవుడ్ నుంచి నటీనటులు హాజరయ్యారని తెలుస్తుంది. ఇక త్వరలో బెంగళూరు వేదికగా యాశ్- రాధికా పండిత్‌ల వివాహం ఒక్కటే మిగిలింది.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ