Advertisementt

శృతిహాసన్.. వివరణ ఇచ్చి తప్పుచేసిందా?

Wed 17th Aug 2016 06:51 PM
shruti haasan,sabaash naidu,kamal haasan,gauthami,shruti haasan sabaash naidu controversy  శృతిహాసన్.. వివరణ ఇచ్చి తప్పుచేసిందా?
శృతిహాసన్.. వివరణ ఇచ్చి తప్పుచేసిందా?
Advertisement
Ads by CJ

కమల్ హాసన్ హీరోగా 'శభాష్ నాయుడు' సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో కమల్ హాసన్ కూతురు శృతి హాసన్ కూడా నటిస్తుంది. ఈ సినిమాకి ప్రస్తుతం కమల్ తో సహజీవనం చేస్తున్న గౌతమీ కాస్ట్యూమ్ డిజైనర్ గా పని చేస్తుంది. ఇంతకీ విషయం ఏమిటంటే గౌతమీ అంటే శృతి హాసన్ కి మొదటి నుండి పెద్దగా పడేది కాదని... ఇక ఈ సినిమా విషయంలో అస్సలు పడడం లేదని కోలీవుడ్ మీడియా కోడై కూసిన విషయం తెలిసిందే. వీరిద్దరికి సంధి కుదర్చడానికి కమల్ కి తల ప్రాణం తోకకి వచ్చిందని కూడా మీడియాలో వార్తలు హల్ చల్ చేసిన విషయం తెలిసిందే. అసలు ఈ గొడవకి కారణం గౌతమీ చేసే కాస్ట్యూమ్ డిజైన్స్ శృతికి  నచ్చడం లేదని అందుకే శృతి తరుచూ గౌతమితో గొడవ పడుతుందని అంటున్నారు. స్వతహాగా శృతి హాసన్ ఫ్యాషన్ డిజైనర్ అవ్వడం వల్ల గౌతమీ చేసే డిజైన్స్ నచ్చడం లేదని అందుకే ఈ గొడవ అని అనుకుంటున్నారు. ఇది జరిగి చాలాకాలమే అయ్యింది. ఇన్ని రోజుల తర్వాత శృతి హాసన్ ఇప్పటికి మీడియా ముందుకు వచ్చి మా మధ్య ఏమి గొడవలు జరగలేదని... అదంతా మీడియా సృష్టే అని తన మేనేజర్ చేత ఓ లెటర్ రిలీజ్ చేయించింది. దీంతో.. శృతి ఈ విషయం పై స్పందించి..ఈ విషయాన్ని నిజం చేసిందని అంటున్నారు. అసలు గొడవ జరగకపోతే కామ్ గా ఉంటే సరిపోయేది. ఇన్ని రోజుల తర్వాత స్పందించాల్సిన అవసరం కూడా లేదు.. మరి శృతి ఎందుకిలా చేసింది? మొత్తానికి వీరి మధ్య ఏదో మేటర్ జరుగుతుందనేది మాత్రం..క్లియర్ గా తెలుస్తుంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ