Advertisementt

అమూల్యతో ఆ దర్శకుడి వివాహం!

Wed 17th Aug 2016 04:51 PM
amulya,hanu raghavapudi marriage with doctor amulya,krishnagaadi veera prema gadha,andala rakshasi  అమూల్యతో ఆ దర్శకుడి వివాహం!
అమూల్యతో ఆ దర్శకుడి వివాహం!
Advertisement
Ads by CJ

టాలీవుడ్ లో వరుసగా దర్శకులు పెళ్లి భాజా మోగిస్తున్నారు. మొన్న డైరెక్టర్ క్రిష్ రమ్యను వివాహమాడిన విషయం తెలిసిందే. కాగా ఇప్పుడు యువ దర్శకుడు హను రాఘవపూడి కూడా అదే వరుసలో ఉన్నాడు. హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ అమూల్యతో హను రాఘవపూడి వివాహం ఆగష్టు 26వ తేదీ జరగనుంది. కాగా మే నెలలోనే ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో డాక్టర్‌గా పని చేస్తున్న అమూల్యతో హను రాఘవపూడి నిశ్చితార్థం జరిగింది.

అయితే ‘అందాల రాక్షసి’, ‘క్రిష్ణగాడి వీర ప్రేమగాథ’ వంటి సినిమాలకు దర్శకత్వం వహించి టాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు హను రాఘవపూడి.  నితిన్‌తో ప్రస్తుతం ఓ మూవీ చేసేందుకు ప్లాన్ లో వున్న హను రాఘవపూడి, ఆ చిత్రం కాగానే అఖిల్‌తో సినిమాకి ఓకే అనిపించుకుని వున్నాడు.  చేతి నిండా సినిమాలతో వ్యక్తిగతంగా సంసార జీవితంలోకి అడుగుపెట్టబోతున్నాడు హను రాఘవపూడి. కాగా ఆగస్టు 26వ తేది సిటీలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్లో జరగబోయే ఈ వివాహ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో సెలబ్రిటీలు హాజరు కానున్నట్టు తెలుస్తోంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ