Advertisementt

హీరో, విలన్.. రెండూ నేనే అంటున్న హీరో!

Tue 16th Aug 2016 08:51 PM
inkokkadu audio launch,vikram,vikram speech at inkokkadu audio launch,anand shankar  హీరో, విలన్.. రెండూ నేనే అంటున్న హీరో!
హీరో, విలన్.. రెండూ నేనే అంటున్న హీరో!
Advertisement
Ads by CJ

'అపరిచితుడు, శివపుత్రుడు, నాన్న, ఐ' వంటి విలక్షణమైన చిత్రాలలో నటించి ప్రేక్షకులలో తనదైన స్థానాన్ని సొంతం చేసుకున్న హీరో విక్రమ్. ప్రస్తుతం విక్రమ్ నటించిన 'ఇంకొక్కడు' మరో ప్రయోగాత్మక చిత్రం.ఈ  సినిమాలో నయనతార, నిత్యామీనన్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు.  తమిళంలో ఇరుముగన్ గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని తెలుగులో నీలం కృష్ణారెడ్డి ఎన్.కె.ఆర్ ఫిల్మ్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నాడు.ఆనంద్ శంకర్ దర్శకుడుగా, హరీష్ జైరజ్ సంగీతం అందించిన ఇంకొక్కడు చిత్రం ఆడియో రిలీజ్ హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. 

బాహుబలి చిత్రానికి రచయితగా ఉన్న విజయేంద్రప్రసాద్ ఈ  కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్నాడు. వరుణ్ రెడ్డి, ప్రగ్వా జైశ్వాల్ సినిమాకు చెందిన థియేట్రికల్ ట్రైలర్ ను విడుదల చేశారు. విక్రమ్ ఆడియో సీడీని విడుదల చేసి విజయేంద్రప్రసాద్ కు అందించాడు. తర్వాత  హీరో విక్రమ్ మాట్లాడుతూ... ఈ సినిమాలో దర్శకుడు నన్ను అత్యంత స్టైలిష్ గా చూయించాడు. ఇంతకు ముందు చేసిన సినిమాల కంటే ఇది డిఫరెంటుగా ఉంటుంది. విచిత్రంగా ఈ సినిమాలో హీరో, విలన్ రెండూ నేనే. అఖిలన్, లవ్ అనే రెండు పాత్రల్లో హీరో అఖిలన్ అయితే విలన్ లవ్. ఈ రెండు పాత్రలను నా చేతే చేయించాడు దర్శకుడు. అద్భుతమైన కథ,కథనం తో వస్తున్న చిత్రం ఇంకొక్కడు. ఇది అందరికీ నచ్చే సినిమా అవుతుందని హీరో విక్రమ్ తెలిపాడు. 

Click Here to See the Inkokkadu Audio Launch Photos

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ