కబాలి సినిమా విడుదలకు ముందు ఎంత సంచలనం సృష్టించిందో విడదలయ్యాక అందరినీ అంతే నిరుత్సాహ పరిచింది. కబాలి విడుదల సమయంలో ప్రపంచస్థాయిలో అబిమానులున్న రజనీకాంత్ కు ఈ సినిమా ప్రపంచ రికార్డులన్నీ తిరగరాస్తుందని అప్పట్లో సంచలనానికి దారితీసింది. దాంతో డిస్టిబ్యూటర్లు పోటీ పడి మరీ కబాలిని కొన్నారు. కానీ కొన్నవారిని చాలా నిరాశకు గురి చేసింది కబాలి చిత్రం. వారికి సగానికి సగం కూడా మనీ రిటర్న్స్ రాని పరిస్థితి ఏర్పడింది. ఇటువంటి దారుణ పరిస్థితి నుంచి కొంతలో కొంతయినా నష్ట నివారణ చర్యలు చేపడదామని చిత్రబృదం పథకం వేసింది.
కబాలి చిత్రానికి గాను రజనీ కాంత్ ఉపయోగించిన షూటు, బూటు, కళ్ళజోడు, కారు తదితర వస్తువులను ఏకంగా వేలానికి పెట్టి దాని ద్వారా భారీ మొత్తాన్ని రాబట్టాలని చూస్తుంది చిత్రబృదం. రజనీకాంత్ అంటే ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్న విషయం తెలిసిందే. ఇక ఏముంది ప్రపంచ వ్యాప్తంగా అభిమానుల మనస్సులను చూరగొన్న రజనీకాంత్ ను అప్పుడప్పుడూ వాళ్ళు తలచుకుంటే ఈ పరికరాలు భారీ స్థాయిలో సేల్ కావచ్చంటున్నారు చిత్ర యూనిట్. అవి వేలం వేసి, పెద్ద మొత్తం పలికి దాని ద్వారా మూవీ కొన్న వారు కోలుకునే పరిస్థితి వస్తే మంచిదేగా.