70 వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు భారత దేశవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అనంతపూర్ లో స్వాతంత్య్ర దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ కేంద్రంపై తీవ్రమైన కోపాన్ని ప్రదర్శించాడు. రాయలసీమపై మమకారాన్ని చూపాడు. ప్రతిపక్షంపై అతి వ్యతిరేకతను వ్యక్తపరిచాడు. కేంద్ర ప్రభుత్వం ఏపీ రాజధాని నిర్మాణానికి నిధులు ఇవ్వడంలో తీవ్ర జాప్యం చేస్తోందంటూ మండి పడ్డారు. రాజధాని, పోలవరం, లోటుబడ్జెట్ విషయాల్లో కేంద్రం ప్రభుత్వం సహకారం లోపిస్తుందని ఆయన ఆవేశంగా మాట్లాడాడు.
కేంద్రం తెలుగు ప్రజలను రెండు రాష్ట్రాలుగా విభజించింది. ఆ సందర్భంగా విభజన చట్టంలో పలు హామీలు ఇచ్చింది, ఇప్పుడు వాటన్నింటినీ నెరవేర్చాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపైనే ఉందని బాబు వెల్లడించాడు. ఇంకా బాబు మాట్లాడుతూ ఏపీకి ఎంతో మేలును ఒనగూర్చి పెట్టి అభివృద్ది త్వరితగతిన జరిగేందుకు అవకాశమిచ్చే ప్రత్యేక హోదా, విశాఖ రైల్వే జోన్ లని వెంటనే అమలు చేయడంలో నిర్లక్ష్యం చూపుతుందని మండిపడ్డాడు. ఏపీలో రెవెన్యూ లోటును ఏమాత్రం భర్తీ చేయడం లేదని, రాజధానికి నిధులు ఇవ్వడం లేదని, పోలవరంకు నిధులు మంజూరు చేయడం లేదని చంద్రబాబు ఆరోపణాస్త్రాలను సంధించాడు. ఎన్ డి ఏ లో భాగస్వామి పక్షంగా ఉన్న చంద్రబాబు ఇటువంటి వ్యాఖ్యలను అదీ స్వాతంత్య్ర దినోత్సవం రోజు కుండబద్దలు కొడ్డడంపై పలువురు పలురకాలుగా భావిస్తున్నారు. కానీ ఈ మధ్య కాలంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వని పక్షంలో తెదేపా కేంద్రంతో కటీప్ చేసుకొనే దిశగా కూడా అడుగులు వేస్తోందని టాక్. అదే జరిగితే వచ్చే నిధులు కూడా రావని మరో టాక్. చూద్దాం ఏం జరుగుతుందో..?