Advertisementt

బాబు జాతకంపై రోజా కామెంట్లు !

Tue 16th Aug 2016 02:33 PM
chandrababu naidu,roja,astrology,roja fire on chandrababu  బాబు జాతకంపై రోజా కామెంట్లు !
బాబు జాతకంపై రోజా కామెంట్లు !
Advertisement
Ads by CJ

వైసీపీ ఫైర్ బ్రాండ్ ఆర్కే రోజా మాటలు తూటాల్లా ఉంటాయి. పక్కన ఆ వ్యక్తి ఉండాలే గానీ అతడికి నిజంగా అవి గుచ్చుకొని వేదిస్తాయి. ఈ మధ్య కాలంలో రోజా మళ్ళీ తెదేపాలోకి వెళ్తుందన్నట్లుగా వార్తలు వచ్చాయి. ఆ విషయంపై చాన్నాళ్ళ నుండి సైలెంట్ గా ఉన్న రోజా తాజాగా వైలెంట్ గా రియాక్షన్ చూపింది. అలాంటి వాళ్ళను వెల్లడించే ప్రబుద్ధలంతా ఆ బాబు గారి అనుకూల మీడియా వారే. ఆ విషయంలో తెలియని వారెవరున్నారు. తాను వైసీపీని వీడే సమస్యే  లేదు అంటూ మండిపడ్డారు. ఇంకా రోజా మాట్లాడుతూ పార్టీ మారడం అదొక మైండ్ గేమ్ అవుతుందని, అదొక ఫన్నీ థింగ్ గా కొట్టిపారేశారు. 

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఆమె మండిపడ్డారు. కృష్ణ పుష్కరాల సమయంలో ప్రజల విశ్వాసాలతో ముడిపడిన దాదాపు 30 గుళ్ళను కూల్చివేసి మరీ ఆ విగ్రహాలను లారీలతో సుదూరప్రాంతాలకు తరలించడం అంత నీచమైన పని మరొకటి ఉండదని ఆమె మండిపడ్డారు. గతంలో కూడా తిరుమల వేంకటేశ్వరుని వెయ్యి కాళ్ళ మండపాన్ని టచ్ చేయడంతో తగిన విధంగా శాస్తి జరిగిందని ప్రస్తుతం అదే పని మళ్ళీ మళ్ళీ చేస్తున్నాడని ఆమె వెల్లడించింది. 

కృష్ణ పుష్కరాల సందర్భంగా దేవుడి విగ్రహాలనే ముక్కలు చేసిన తెదేపా నాయకులు తెదేపాను కూడా దేవుడు ముక్కలు చేయలేడా అంటూ ఎన్నాళ్ళ నుండో తన మనసులో గూడుకట్టకున్న రహస్యాన్ని జోస్యంలా బయటికి పొక్కింది. కాగా ఆ గుళ్ళు, మసీదుల విషయంలో చంద్రబాబుపై ఆ ప్రాంత ప్రజానీకం కూడా గుర్రుగా ఉన్న విషయం తెలిసిందే.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ