'గౌరవం'తో విమర్శలను గమనించి, 'కొత్తజంట'తో ఆ విమర్శకులకు కాస్త దగ్గరై 'శ్రీరస్తు శుభమస్తు'తో ఇంకాస్త దగ్గరయ్యేందుకు ప్రయత్నించాడు అల్లు శిరీష్. ఇంతవరకు ఓకే, అందరూ అంగీకరించే విషయమే, కానీ ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే అల్లు అర్జున్ కంటే అల్లు శిరీష్ అద్భుతంగా రాణిస్తున్నాడనే విషయం. ఇది స్వయంగా అల్లు అర్జున్ తో సినిమాలు తీసిన సుకుమార్ వంటి దర్శకుల నోటి నుండి అలా సరదాగా కూడా రాకూడని విషయాన్ని ఇప్పుడు అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. సరే అన్న దమ్ములే కదా అని ఎంత వదిలేద్దామనుకున్నా అస్సలు నక్కకు నాగలోకానికి ఏంటి పోలిక అని కూడా అభిమానులు చెలరేగిపోతున్నారు.
శిరీష్ ప్రస్తుతం పీరియడిక్ మూవీస్ చేస్తున్నాడని టాక్. అందులో ఎంతమాత్రం కనెక్ట్ అవుతాడనేదే కావాలి. ఈ విషయం అలా ఉంచితే దర్శకుడు సుకుమార్ స్వయంగా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ అల్లు శిరీష్ ఈ మధ్య నటనలో బాగా రాణిస్తున్నాడని, హాస్యాన్ని పండించే పాత్రల్లో అన్న అల్లు అర్జున్ ని మించి పోయాడని పుసిక్కిన నోరు జారాడు. ఈ విషయాన్ని ముందుగానే శిరీష్ తో అన్నట్లుగా ఉంది, కామెడీయే నా బలం. శ్రీరస్తు శుభమస్తు చిత్రంలో కామెడీనే బాగా పండించాను అంటూ అల్లు శిరీష్ చెప్పుకొస్తున్నాడు. కామెడీ అంటే తెచ్చి పెట్టుకొనే డబుల్ మీనింగ్ డైలాగ్ లు కాదని, పాత్రల్లో సంలీనమై ఆ సన్నివేశానికి తగిన టైమింగ్ పంచ్ లే అని గుర్తించాలి. కానీ ఇలా డబుల్ మీనింగ్ డైలాగ్ లతో కామెడీ హీరో అయిపోయాడంటూ, ఇంకా అల్లు అర్జున్ ని మించి పోయాడంటూ సభావేదికల్లో ప్రగల్భాలు పలకడం తమ మెప్పు పొందేందుకే సుకుమార్ అలా అనేసివుంటాడని అనుకోవాలి.