బాలీవుడ్ హీరో అక్షయ కుమార్ నటించిన 'రుస్తుం' చిత్రం భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. అదేరోజు విడుదలైన ‘మెహంజెదారొ’ సినిమా కలెక్షన్స్ పరంగా చతికిల పడటంతో రుస్తుమ్ మాత్రం భారీ వసూళ్ళతో పరిగెడుతుంది.
అద్భుతమైన కథా కథనంతో బాలీవుడ్ హీరో అక్షయ కుమార్ పండించిన భావోద్వేగాలు రుస్తుం చిత్రానికి పాజిటివ్ టాక్ రావడానికి కారణంగా చెప్పవచ్చు. 1959లో బాంబే నేపథ్యంగా సాగ్ ఓనేవీ అధికారి కథతో 'రుస్తుమ్' తెరకెక్కింది. ఇందులో అక్షయ్ కుమార్ నేవీ అధికారి. మంచి సర్వీసు అందించి గొప్ప ప్రతిభను ప్రదర్శించి పురస్కారాలు అందుకుంటాడు. అనుకోకుండా ఓ పార్టీలో అమ్మాయిని చూసి ప్రేమించి పెళ్ళి చేసుకుంటాడు. ఆమె మాత్రం అతన్ని కళ్ళుగప్పి మరొకరితో శృంగారంలో పాల్గొంటుండగా అతనికి దొరికిపోతుంది. అది చూసిన వెంటనే భార్య పక్కనున్న వ్యక్తిని కాల్చి చంపుతాడు. ఆ తర్వాత అతడిని పోలీసులు కోర్టులో ప్రవేశ పెడితే అక్కడ తెలుస్తుంది.... అతడు కాల్చింది... భార్యతో శృంగారంలో పాల్గొన్నందుకు కాదట. అందుకు కారణం ఉంది. ఇలాంటి వైవిధ్య భరితమైన గొప్ప కథాంశం ఉన్న చిత్రంగా 'రుస్తుమ్' తెరకెక్కింది.
ఇంకా నావికాదళ ఆఫీసర్ కేఎం నానావతి జీవితకథ ఆధారంగా తెరకెక్కిన 'రుస్తుం' చిత్రానికి గాను వచ్చిన సమీక్షలు అంత ఆకర్షినీయంగా లేకపోయినా ఈ వారంలో మరో గట్టి చిత్రం లేకపోవడంతో ఈ చిత్రానికి మంచి కలెక్షన్స్ రావడానికి కారణమైంది. ఇంకా అలా శనివారం నుండి ఆదివారం వరకు కూడా వరుస సెలవులు కావడంతో మొదటి వారాంతానికే రూ.100 కోట్లు వసూళ్ళు చేసే అవకాశం ఉందని సినీ పండితుల అంచనా. ఓవర్సీస్ లో కూడా రుస్తుమ్ కు మంచి ఆదరణ లభిస్తుండటంతో మొత్తానికి ఆ దిశగా వసూళ్ళ వర్షం కురిపిస్తున్న చిత్రంగా ‘రుస్తుమ్’ ఈ వారం మంచి ఫలితాన్ని అందుకోనుంది.