Advertisementt

తెలుగు టాప్ హీరోతో యేలేటి సినిమా..!

Mon 15th Aug 2016 08:33 PM
chandra sekhar yeleti,manamantha,nagarjuna,chandra sekhar yeleti movie with nagarjuna  తెలుగు టాప్ హీరోతో యేలేటి సినిమా..!
తెలుగు టాప్ హీరోతో యేలేటి సినిమా..!
Advertisement
Ads by CJ

'మనమంతా' సినిమాతో అందరిచేత కీర్తించబడుతున్న చంద్రశేఖర్‌ యేలేటికి మంచి రోజులు వచ్చేసినట్లేనా..అంటే అవుననే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. యేలేటి మొదటి నుండి చేసిన సినిమాలన్నీ వైవిధ్యభరితమైనవే. కమర్షియల్‌ సక్సెస్‌ అనేది ప్రక్కన పెడితే..యేలేటి చేసిన ప్రయత్నాలన్నీ విజయవంతమైనవిగానే మన ఇండస్ట్రీ చెబుతుంది. అందుకే యేలేటి సినిమా అంటే ప్రేక్షకులకు ఒక స్పెషల్‌ ఇంట్రెస్ట్‌ ఉంటుంది. అయితే.. టెక్నిషియన్‌గా టాప్‌ స్థాయిలో ఉండాల్సిన యేలేటికి అంత గుర్తింపు ఇప్పటి వరకు రాలేదనే చెప్పుకోవాలి. కానీ..'మనమంతా' తో ఇప్పుడు యేలేటి అందరివాడయ్యాడు. తెలుగు టాప్‌ హీరోలలో ఒకరైన నాగార్జున..చంద్రశేఖర్‌ యేలేటితో సినిమా చేసేందుకు రెడీ అని చెప్పేశాడు. వరుస విజయాలతో దూసుకుపోతున్న నాగ్‌ కూడా..వైవిధ్యభరిత చిత్రాలు చేయడానికి ఎప్పుడూ ముందుంటాడు. ప్రస్తుతం యేలేటి దగ్గర ఉన్న స్కిప్ట్‌ విన్న నాగ్‌..ప్రస్తుతం చేస్తున్న 'ఓం నమో వేంకటేశాయ' పూర్తవ్వగానే..ఈ సినిమానే చేద్దాం అని మాటిచ్చాడంట. మరి నాగ్‌ మాటిచ్చాడంటే.. మరో ఛాన్స్‌ ఇవ్వడు. చంద్రశేఖర్‌ యేలేటితో చిత్రం సెట్‌ ఎక్కినట్లే. మరి ఈ చిత్రం కనుక యేలేటి సక్సెస్‌ చేయగల్గితే, కమర్షియల్‌గా కూడా యేలేటికి మంచి పేరు, ఆయన వృత్తిలో అగ్ర స్థానం దక్కే అవకాశాలు ఉన్నాయంటూ..ఇండస్ట్రీ వర్గాలు అప్పుడే గుసగుసలాడుకుంటున్నాయి.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ