Advertisement

అసలు 'జనతా గ్యారేజ్‌' లక్ష్యమేంటి?

Mon 15th Aug 2016 06:37 PM
jr ntr,janatha garage,young tiger ntr,mohanlal,janatha garage target,koratala siva  అసలు 'జనతా గ్యారేజ్‌' లక్ష్యమేంటి?
అసలు 'జనతా గ్యారేజ్‌' లక్ష్యమేంటి?
Advertisement

కొరటాల శివ మొదటి రెండు చిత్రాలు 'మిర్చి, శ్రీమంతుడు' సినిమాలు బ్లాక్‌బస్టర్స్‌గా నిలిచాయి. ఈ చిత్రాలు ప్రభాస్‌, మహేష్‌బాబులకు అద్భుతమైన విజయాలుగా నమోదయ్యాయి. కాగా ప్రస్తుతం కొరటాల శివ ఎన్టీఆర్‌, మోహన్‌లాల్‌లతో చేస్తున్న 'జనతా గ్యారేజ్‌' కూడా బ్లాక్‌బస్టర్‌గా నిలిస్తే తొలిమూడు చిత్రాలతో హ్యాట్రిక్‌ విజయాలను సాధించిన దర్శకునిగా కొరటాల రికార్డ్‌ సృష్టిస్తాడు. ఇక ఎన్టీఆర్‌ విషయానికి వస్తే ఆయన ఇటీవల నటించిన 'టెంపర్‌, నాన్నకు ప్రేమతో' చిత్రాలు బ్లాక్‌బస్టర్స్‌ కాకపోయినా ఓకే అనిపించాయి. ఎన్టీఆర్‌ కూడా కొరటాల తనకు ప్రభాస్‌, మహేష్‌బాబులకు ఇచ్చినట్లుగా ఆల్‌టైమ్‌ బ్లాక్‌బస్టర్‌గా 'జనతాగ్యారేజ్‌' చిత్రాన్నిస్తాడనే ఆశపడుతున్నాడు. 'జనతా గ్యారేజ్‌' హిట్టయితే ఎన్టీఆర్‌కు అది బ్లాక్‌బస్టర్‌గా నిలుస్తుంది. ఆడియో వేడుకలో ఎన్టీఆర్‌ చెప్పినట్లు గత పుష్కరకాలం సమయంలో తనకు 'సింహాద్రి' రూపంలో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిందని, మరలా తనకు ఆ స్ధాయి బ్లాక్‌బస్టర్‌గా 'జనతాగ్యారేజ్‌' నిలవాలని ఆశపడుతున్నాడు. ఇక ఈ చిత్రం ట్రైలర్స్‌ , సాంగ్స్‌ అందరినీ ఆకట్టుకుని అంచనాలు పెంచేస్తున్నాయి. ఎన్టీఆర్‌ లుక్‌, మోహన్‌లాల్‌ అప్పీరియన్స్‌లు అదుర్స్‌ అనే స్దాయిలో ఉన్నాయి. ఇక ఈచిత్రానికి మిగిలిన మరో అట్రాక్షన్‌ మోహన్‌లాల్‌ అనే చెప్పాలి. ఈయన పాత్ర చిత్రానికి ఎంతో ప్లస్‌ కావడమే కాదు.. మలయాళ మార్కెట్‌లో ఈ చిత్రం అదరగొట్టడానికి రెడీ అవుతోంది. కాగా తన కెరీర్‌లో ఇప్పటివరకు చేయని గ్లామర్‌షోతో సమంత కూడా హీట్‌ పుట్టిస్తోంది. మొత్తానికి ఈచిత్రం అలాంటి ఇలాంటి హిట్‌ కాదు.. బ్లాక్‌బస్టర్‌గా నిలవాలని ఎన్టీఆర్‌తోపాటు ఆయన అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. మరి ఈ చిత్రం ఆ స్థాయి హిట్‌ను అందుకుంటుందో లేదో వేచిచూడాల్సివుంది...! 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement