మణిరత్నం ఏదైనా భాషలో ఒక సినిమా తీస్తున్నాడంటే ఈ చిత్రం కోసం ఇతర భాషా సినీ ప్రేమికులతో పాటు దేశవ్యాప్తంగా అందరూ ఎదురుచూస్తూవుంటారు. వీలుంటే ఆ చిత్రాన్ని తమ భాషల్లో డబ్ చేసుకోవడానికి కూడా సిద్దంగా ఉంటారు. కాగా చాలాకాలం తర్వాత ఆయన ఇటీవల తీసిన 'కాదల్ కన్మణి' చిత్రం తెలుగు డబ్బింగ్ రైట్స్‌ను దిల్‌రాజు తీసుకొని 'ఓకే బంగారం' గా విడుదల చేసి మంచి లాభాలను రాబట్టగలిగాడు. ఇక్కడ దిల్‌రాజు చేసిన పబ్లిసిటీ, ఆయన బేనర్ వాల్యూలు ఈ చిత్రానికి కలిసి వచ్చాయి. దీంతో మణిరత్నం తను కార్తి, అతిధిరావ్ హైదరీల కాంబినేషన్‌లో తమిళంలో తీస్తున్న తాజా చిత్రం 'కాట్రువెలిదయై' తెలుగు రైట్స్‌ను సైతం దిల్‌రాజుకే మణిరత్నం అందించాడు. ఈ చిత్రం కోసం మరో తెలుగు నిర్మాత ఫ్యాన్సీ రేటును ఆఫర్ చేసినా కూడా మణిరత్నం మాత్రం దిల్‌రాజుకే ఓటేశాడు. రెహ్మాన్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని దిల్‌రాజు కూడా మంచి రేటుకే తీసుకున్నాడట. మరి ఈ చిత్రానికి తెలుగు టైటిల్‌ను సైతం దిల్‌రాజు త్వరలో అఫీషియల్‌గా ప్రకటించనున్నాడు.