వరుస విజయాలతో ఊపు మీదున్న స్టార్ హీరో అల్లు అర్జున్. కాగా అల్లు అర్జున్ నటించే తదుపరి చిత్రంపై ఇంకా పూర్తి క్లారిటీ రాలేదు. 'సరైనోడు' విడుదలై 100 రోజులు పూర్తయినా.. బన్నీ మాత్రం మౌనంగానే ఉన్నాడు. 'సరైనోడు' చిత్రం కేవలం ఫర్వాలేదని, యావరేజ్ మాత్రమే అనుకున్న సమయంలో ఈ చిత్రం బ్లాక్‌బస్టర్‌గా నిలిచి దాదాపు 80కోట్లు వసూలు చేసి అందరి అంచనాలను తల్లకిందులు చేసింది. ఈ చిత్రంతో తనకువున్న ఫాలోయింగ్ ఎంతో బన్నీకి అర్ధమైంది. దీంతో ఆయన లింగుస్వామి, విక్రమ్ కె.కుమార్‌లను పక్కనపెట్టి హరీష్‌శంకర్ చిత్రం చేయనున్నాడని సమాచారం. ఈ చిత్రాన్ని 'ఆర్య, పరుగు' చిత్రాల తర్వాత దిల్‌రాజు నిర్మించనున్నాడు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తాడని సమాచారం. ఇక హరీష్‌శంకర్ చెప్పిన కథ బన్నీకి నచ్చినప్పటికీ పూర్తిస్ఠాయిలో ఆయన శాటిస్‌ఫై కాలేదట. అందుకే స్క్రిప్ట్‌లో ఎన్నో మార్పులు చేర్పులు చేయిస్తూ హరీష్‌శంకర్ చేత ఇంకా ఇంకా మెరుగులు దిద్దిస్తునే ఉన్నాడు. బన్నీ 'సరైనోడు' సమయంలో కూడా బోయపాటి చేత ఎంతో హోంవర్క్ చేయించాడు. అది ఆ చిత్రానికి ఎంతో వర్కౌట్ కావడంతో ఈ తాజా చిత్రం విషయంలో కూడా బన్నీ ఇదే స్ట్రాటర్జీని ఫాలో అవుతున్నాడని తెలుస్తోంది. ఒకవైపు దిల్‌రాజు, మరోవైపు బన్నీలు హరీష్ చేత మద్దెల వాయిస్తున్నారు. అయినా వరస హిట్లలో ఉన్నప్పుడు ఇలాంటి జాగ్రత్తలు చాలా అవసరమే అని, అదే బన్నీ, అరవింద్‌ల పక్కా ప్రణాళిక అంటున్నారు ఫిల్మ్‌నగర్ వాసులు.