'జనతా గ్యారేజ్' ఆడియో వేదికపై యంగ్‌టైగర్ యన్టీఆర్ స్పీచ్ విన్న వాళ్లంతా..ఇదే అనుకుంటారు. ఎందుకంటే స్వయంగా యన్టీఆరే ఈ విషయం గురించి చాలా క్లారిటీగా చెప్పాడు కాబట్టి. 'ఆది, సింహాద్రి' వంటి సక్సెస్‌లు రావడంతో..ఇంక ఇదే రూటు అనుకున్నట్లుగా, ఇంక తిరుగేలేదన్నట్లుగా అనుకున్నానని యన్టీఆర్ చెప్పుకొచ్చాడు. ఆ టైమ్‌లో జరిగిన ఓ సంఘటన ఇక్కడ ప్రస్తావించాలి. 'సింహాద్రి' సినిమా టైమ్‌లో ఓ తెలుగు మ్యాగ్‌జైన్ ఆ సినిమాని ప్లాప్‌గా ప్రకటించిందట. ఈ విషయం ఎన్టీఆర్ వరకు వెళ్ళడంతో..సదర్ మ్యాగ్‌జైన్‌పై డైరెక్ట్ గా యన్టీఆర్ ఫైర్ అయినట్లుగా అప్పట్లో వినిపించింది . 'సింహాద్రి' విజయాన్ని తలకెక్కించున్న యన్టీఆర్ ఆ టైమ్‌లో ఎవర్నీ లెక్క చేసేవాడు కాదంట. కానీ నేడు.. జీవితం గురించి, దాని పరమార్థం గురించి బాగా తెలుసుకున్నట్లున్నాడు. దేవుడు వేసిన మొట్టికాయలు బాగా పని చేసినట్లున్నాయి. ఇప్పుడు తను చేస్తున్న పనులు ఈ విషయాన్ని క్లియర్ చేస్తున్నాయి. నేడు తన ఫ్యాన్స్‌తో ఎంతో ఓపికగా..గంటగంటలు గడిపేస్తూ..ప్రత్యేకంగా వారిని కలుసుకునేందుకు టైమ్ ఇవ్వడం కూడా ఇప్పుడు యన్టీఆర్‌లో వచ్చిన మార్పుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఇదనే కాదు..ఇప్పుడు ఎదుటివారిని గౌరవించడంలోనూ, వారి కష్టాలు తెలుసుకోవడంలోనూ..యన్టీఆర్ శ్రద్ధపెడుతుండటం చూసిన వారంతా..యన్టీఆర్‌లో ఇంత మార్పా అంటూ..ఆశ్చర్యపోతున్నారు.