ఇటీవల కేవలం కోటిరూపాయల బడ్జెట్‌తో రూపొందిన చిన్న చిత్రం 'పెళ్ళిచూపులు'. ఈ చిత్రం సంచలన విజయాన్ని సొంతం చేసుకొంటోంది. ఇప్పటికే ఈ చిత్రం నైజాంలోనే రూ.3కోట్లకు పైగా షేర్ వసూలు చేసి, ఓవర్‌సీస్‌లో కూడా మిలియన్ మార్కుకు దగ్గరలో ఉంది. ముఖ్యంగా ఏ క్లాస్ ఆడియన్స్‌ను, మల్టీప్లెక్స్ ఆడియన్స్‌ను ఆకట్టుకోవడంతో ఈ చిత్రం ఘనవిజయం సాధించింది. కాగా ఈచిత్రం హిందీ రీమేక్ రైట్స్‌ను స్టార్‌హీరో సల్మాన్‌ఖాన్ సొంతం చేసుకున్నాడు. తన బావమరిది ఆయుష్ శర్మను ఈ చిత్రం కోసం నిర్మాతగా మార్చాడు. ఈ చిత్రానికి తెలుగులో దర్శకత్వం వహించిన తరుణ్‌భాస్కరే.. ఈ చిత్ర రీమేక్‌కు దర్శకత్వం వహించనున్నాడని సమాచారం.