Advertisementt

మోక్షజ్ఞ సినీ ప్రవేశంపై బాలకృష్ణ స్పందన!

Sat 13th Aug 2016 09:07 PM
balakrishna,mokshagna,mokshagna cine entry,balakrishna about mokshagna cine entry,amaravathi,gautamiputra satakarni  మోక్షజ్ఞ సినీ ప్రవేశంపై బాలకృష్ణ స్పందన!
మోక్షజ్ఞ సినీ ప్రవేశంపై బాలకృష్ణ స్పందన!
Advertisement
Ads by CJ

టాలీవుడ్ ప్రముఖ హీరో, హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తన కుమారుడు మోక్షజ్ఞ సినిమా రంగ ప్రవేశంపై తన మనసులోని మాటను బయట పెట్టారు. కృష్ణ పుష్కరాల సందర్భంగా బాలకృష్ణ సరికొత్త రీతిలో భక్తులకు దర్శనమిచ్చిన విషయం తెలిసిందే. ఫుల్ జోష్ లో ఉన్న నందమూరి బాలకృష్ణ అభిమానులకు తన కుమారుడి సినిమా ప్రవేశంపై నోరు మెదిపారు. 

బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశంపై చాలా కాలం నుండి వార్తలు వస్తూనే ఉన్నాయి. పలువురు దర్శకులు అప్పుడే మోక్షజ్ఞ సినిమా కోసమని స్క్రిప్ట్స్ కూడా రడీ చేసుకుంటున్నారన్నట్లు పలు రకాలుగా ఊహాగానాలు చెలరేగాయి. అయితే బాలకృష్ణ ఆ విషయంపై స్పందిస్తూ.. మోక్షజ్ఞ తప్పకుండా సినిమాల్లోకి వస్తాడు, హీరోగా అద్భుతమైన చిత్రాలు చేస్తాడు. అయితే అది ఇప్పుడు కాదు. అతడు ఇప్పుడు చదువు కుంటున్నాడు. అది అయిపోయిన వెంటనే అంటే వచ్చే యేడాది చివరికల్లా సినీ ప్రవేశం ఉంటుంది..అని తెలిపాడు. అంటే మోక్షజ్ఞ సినీరంగ ప్రవేశం 2017 డిసెంబర్ నాటికి కావచ్చన్న మాట.  కాగా బాలకృష్ణ ఇంకా మాట్లాడుతూ అమరావతి వైభవాన్ని ప్రపంచానికి చాటిచెప్పేలా 'గౌతమీపుత్ర శాతకర్ణి' చిత్రంలో చేస్తున్నట్లుగా వివరించారు. కృష్ణ పుష్కర స్నానం కూడా బాలకృష్ణ.. గౌతమీపుత్ర శాతకర్ణి వేషధారణలోనే ఆచరించిన విషయం విదితమే.