Advertisementt

ఎన్టీఆర్ పెద్ద హీరో ఓకే..మరి సత్యమూర్తి సన్?

Sat 13th Aug 2016 08:48 PM
nithya menen,son of satyamurthy,janatha garage,allu arjun,ntr,nithya menen controversy dialogues  ఎన్టీఆర్ పెద్ద హీరో ఓకే..మరి సత్యమూర్తి సన్?
ఎన్టీఆర్ పెద్ద హీరో ఓకే..మరి సత్యమూర్తి సన్?
Advertisement
Ads by CJ

తెలుగు సినీ ఇండస్ట్రీ లో చిన్న, పెద్ద హీరోలతో  సినిమాలు చేసిన నిత్యామీనన్ కి కొంచెం నోటి దూల ఎక్కువే. నిత్యామీనన్ తన మనసులో ఏం అనుకుంటే అది నిర్భయం గా అందరి ముందు మాట్లాడేస్తుంది. కొన్ని సార్లు అలా మాట్లాడడం వల్ల తనకి పొగరు కొంచెం ఎక్కువే అని అనుకునే వాళ్ళు చాలామందే వున్నారు.  అప్పుడెప్పుడో నాకు ప్రభాస్ అంటే ఎవరో తెలీదని చెప్పి పెద్ద దుమారాన్నే లేపింది. ఇక ఆమధ్య 'జనతా గ్యారేజ్' షూటింగ్ లో వున్నప్పుడు నేను ఎన్టీఆర్ అంత ఉన్నతమైన వ్యక్తి ని ఇప్పటి వరకు చూడలేదు అని... అతనిలా ఎవరు ఉండరనే కామెంట్ చేసిన నిత్య తాజాగా... 'జనతా గ్యారేజ్' ఆడియోలో మరో సంచలనానికి తెర లేపింది. ఆడియో వేడుకలో ఆమెను స్టేజి మీదకి ఆహ్వానించగానే ఎన్టీఆర్ అభిమానులు చప్పట్లు, విజిల్స్ తో గోల గోల చేశారు. ఇదంతా చూసిన నిత్య ఆనందంతో  నేను మొదటిసారి ఒక పెద్ద సినిమా ఆడియో ఫంక్షన్ కి అటెండ్ అయ్యానని... ఇప్పటి వరకు ఇలాంటి ఫంక్షన్ కి వెళ్లలేదని చెప్పింది. అలాగే ఒక పెద్ద హీరోతో నటిస్తున్నానని చెప్పింది. మరి నిత్య ఇలా ఎలా అనగలిగింది అని అనుకుంటున్నారు జనాలు. ఎందుకంటే ఆమె అల్లు అర్జున్ సినిమా 'సన్ ఆఫ్ సత్యమూర్తి' సినిమాలో వన్ అఫ్ ది హీరోయిన్ గా నటించింది. మరి ఆ సినిమా పెద్ద సినిమా కాదా... అల్లు అర్జున్ పెద్ద హీరో కాదా అనేది ఇప్పుడు ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ అయ్యింది. ఆమెకు ఎన్టీఆర్ ఒక్కడే పెద్ద హీరోలా కనిపించాడా లేక ఎన్టీఆర్ అభిమానులు అలా గోల గోల చేస్తుంటే ఆ ఆనందాన్ని తట్టుకోలేక ఇలా మాట్లాడిందా..... లేక నిజంగానే అల్లు అర్జున్ ని పెద్ద హీరో కింద లెక్క గట్టలేదా అనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఏది ఏమైనా నిత్య మాత్రం తాను అనుకున్న విషయాన్ని జంకు లేకుండా మాట్లాడేస్తుంది అనేది ఈ సంఘటనతో మరోసారి రుజువైంది.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ