త్రివిక్రమ్ సినిమా వస్తుంది అంటే ఆ సినిమా లో డైలాగ్స్ ఎలా ఉంటాయి... హీరోకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తాడనే దాని మీద చర్చ జరుగుతుంది. ఎందుకంటే త్రివిక్రమ్ మాటలు, డైలాగ్స్ హృదయాన్ని హత్తుకునేలా వుంటాయని వేరే చెప్పక్కర్లేదు. ఆయన సినిమాలే ఇందుకు ఉదాహరణ. అందుకే త్రివిక్రమ్ ని మాటల మాంత్రికుడు అంటారు. అయితే త్రివిక్రంతో పని చేయడానికి పెద్ద హీరోలు సైతం ఆసక్తి చూపిస్తున్నారు అంటే అతిశయోక్తి కాదు. కేవలం పెద్ద హీరోలతోనే సినిమాలు చేస్తాడనే పేరున్న ఈ దర్శకుడు చిన్న హీరో నితిన్ తో 'అ.. ఆ' సినిమా తీసి సూపర్ హిట్ కొట్టాడు. పవన్ కళ్యాణ్ కి 'అత్తారింటికి దారేది' వంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన త్రివిక్రమ్ కి ఇప్పుడు ఒక కష్టం వచ్చిపడింది అంటున్నారు. అదేమిటంటే ఇంటికి సంబంధించి కష్టమట. అంటే అతని ఫ్యామిలిలో ఏదో గొడవ అనుకునేరు..అలాంటిది కాదు లేండి. త్రివిక్రమ్ కొత్తగా కడుతున్న ఇంటి గురించిన విషయం. తనకు నచ్చినట్టు ఇల్లు కట్టుకోవడానికి హైదరాబాద్ లోని రిచ్ ఏరియాలో ఒక స్థలం కొని అక్కడ ఇంటి పని మొదలు పెట్టాడట త్రివిక్రమ్. ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ అద్వర్యం లో ఈ ఇంటి పనులు వేగంగా జరుగుతున్నాయట. అయితే ఇక్కడ ఒక చిక్కు వచ్చిపడింది త్రివిక్రమ్ కి. ఈ ఇంటిని పూర్తి చేయడానికి ఇంకా చాలా డబ్బు అవసరం పడిందని... డబ్బులేక ఇంటిపని వాయిదా పడిందని సమాచారం. మరి అంత పెద్ద డైరెక్టర్ అయ్యివుండి... ఇలా డబ్బులేక ఇల్లు నిర్మాణం ఆగిపోవడం విడ్డూరంగా లేదూ. అయితే ఇది నిజమే అని ఈ కారణం గానే త్రివిక్రమ్ మదనపడుతున్నాడని సమాచారం. మరి అంత పెద్ద డైరెక్టర్ కే అలా అయితే చిన్న వాళ్ళ పరిస్థితి ఏమిటి అనుకుంటున్నారు అందరూ.