డైరెక్టర్ కొరటాల శివ తీసిన రెండు సినిమాలు బ్లాక్ బస్టర్స్ అయ్యి అతి కొద్దికాలం లోనే టాప్ డైరెక్టర్స్ జాబితాలో పేరు కొట్టేసాడు. మొదటి సినిమా 'మిర్చి' తో.... ప్రభాస్ కి ఎప్పటికి గుర్తుండిపోయే హిట్ ఇచ్చాడు. అలాగే మహేష్ బాబు కి 'శ్రీమంతుడు' తో ఇండస్ట్రీ హిట్ ని ఇచ్చాడు, ఇప్పుడిక ఎన్టీఆర్ తో 'జనతా గ్యారేజ్' తీస్తున్నాడు, మరి ఎన్టీఆర్ కి ఎలాంటి హిట్ ఇస్తాడో అని ఎన్టీఆర్ అభిమానుల దగ్గర నుండి సగటు ప్రేక్షకులు కూడా వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. అయితే తీసిన రెండు సినిమాలు హిట్ అవ్వడానికి కారణం మాత్రం ఒకటుందని నిన్న(12-08-16) జరిగిన 'జనతా గ్యారేజ్' ఆడియో ఫంక్షన్ లో బయట పెట్టాడు కొరటాల శివ. అందరూ మీరు తీసిన రెండు సినిమాలు సక్సెస్ సాధించడానికి కారణం ఏమిటి అని అడిగారట. అయితే శివ మాత్రం తన విజయానికి తన టీం సభ్యుల సహకారమే అంటున్నాడు. తన టీం తనకు ఇచ్చిన సపోర్ట్ వల్లే ఇదంతా సాధ్యం అయ్యిందని అంటున్నాడు. తనకు బెస్ట్ టీం ఉందని వాళ్ళ సహాయ సహకారాల వల్లే ఇంతటి విజయాన్ని సాధించానని చెబుతున్నాడు శివ. మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ దగ్గర నుండి పాటలు రాసే హరి రామ జోగయ్య వరకు అందరూ మొదట సినిమా నుండి తనకు పని చేస్తున్నారని.... ఈ టీం వల్లే నేను విజయాల్ని సాధిస్తున్నాని చెప్పాడు. మరి ఈ టీమ్ తో 'జనతా గ్యారేజ్' కూడా హిట్ కొడతాననే నమ్మకం తో కొరటాల వున్నాడు.