Advertisementt

మహేష్ కి చెప్పనందుకే.. కోపం..!!

Sat 13th Aug 2016 07:57 PM
mahesh babu,pvp,fire,mahesh babu birthday poster,prince mahesh fire on pvp  మహేష్ కి చెప్పనందుకే.. కోపం..!!
మహేష్ కి చెప్పనందుకే.. కోపం..!!
Advertisement
Ads by CJ

మహేష్ బాబు - మురుగదాస్ కాంబినేషన్ లో ఒక చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అయితే మహేష్ తన తదుపరి చిత్రం వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో నటిస్తున్నాడని వార్తలొస్తున్నాయి. ఈ సినిమాని 'బ్రహ్మోత్సవం' నిర్మాత పివిపి నిర్మిస్తున్నాడని ప్రచారం జరగడమే కాదు పోస్టర్ కూడా వేయించాడు పివిపి. ఈ పోస్టర్ ని మహేష్ బాబు బర్త్ డే సందర్భం గా ఆగష్టు 9 న వేయించారు. 'ఊపిరి' హిట్ తో మంచి జోష్ లో వున్న వంశీ పైడిపల్లి తో గనక మహేష్ ఈ సినిమా చేస్తే అది ఖచ్చితం గా హిట్ అవుతుందని మహేష్ అభిమానులు సంతోషం గా ఫీలయ్యారట. కానీ ఇక్కడ పివిపి పై మహేష్ మండిపడుతున్నాడని సమాచారం. అసలు విషయం ఏమిటంటే అసలు పివిపి దీని గురించి మహేష్ బాబుతో మాట్లాడలేదట. మహేష్ తో మాట్లాడకుండా వంశీ డైరెక్షన్ లో మహేష్ నటిస్తున్నాడని పివిపి పోస్టర్స్ తయారు చేయించాడట. తనని కనీసం సంప్రదించకుండా పివిపి ఇలా చెయ్యడం మహేష్ కి నచ్చలేదని అందుకే పివిపి పై మహేష్ ఫైర్ అయ్యాడని అంటున్నారు. మరి మహేష్ కి మురుగదాస్ తో చిత్రం కంప్లీట్ అయ్యాక మరో రెండు మూడు సినిమాలు లైన్ లో వున్నాయి. ఆ రెండు మూడు సినిమాల్లో పివిపి సినిమా కూడా ఒకటి ఉండటంతో పివిపి అలా చేసి ఉండొచ్చు అని... ఇంత మాత్రం దానికే మహేష్ అలా కోపం తెచ్చుకోవడమేమిటి అంటున్నారు సినీ విశ్లేషకులు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ