Advertisementt

అరవింద్‌ లింకులు అలానే ఉంటాయ్ మరి!

Sat 13th Aug 2016 05:15 PM
allu aravind,satellite rights,srirasthu subhamasthu,dhruva  అరవింద్‌ లింకులు అలానే ఉంటాయ్ మరి!
అరవింద్‌ లింకులు అలానే ఉంటాయ్ మరి!
Advertisement
Ads by CJ

టాలీవుడ్‌లో అద్బుతమైన మేథావి, మాస్టర్‌ మైండ్‌ ఎవరిదంటే అది అల్లు అరవింద్‌దే అని ఒప్పుకోవాలి. సినిమా ఎలా ఉన్నా, దానిని ఎలా ప్రమోట్‌ చేసి లాభాలు గడించేలా స్కెచ్‌లు వేయడంలో ఆయన దిట్ట. కాగా ఇటీవలే ఆయన తన రెండో తనయుడు అల్లుశిరీష్‌ హీరోగా 'శ్రీరస్తు...శుభమస్తు' చిత్రం చేశాడు. అల్లుశిరీష్‌ మొదటి రెండు చిత్రాలతో పోలిస్తే ఈ చిత్రం బాగానే ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. అల్లు శిరీష్‌ మేకోవర్‌, లావణ్య త్రిపాఠి నటన, పరశురాం డిఫరెంట్‌ స్క్రీన్‌ప్లేలు ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి. కాగా ప్రస్తుతం అరవింద్‌... రామ్‌చరణ్‌ హీరోగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో తమిళ 'తని ఒరువన్‌' రీమేక్‌గా 'ధృవ' చిత్రాన్ని కూడా నిర్మిస్తున్నాడు. ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. కాగా ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలతో విడుదల చేయనున్నారు. దీంతో 'ధృవ' శాటిలైట్‌ రైట్స్‌ కావాలంటే, 'శ్రీరస్తు...శుభమస్తు' తీసుకోవాలని కండీషన్‌ పెట్టడంతో దానికి ముందుకు వచ్చిన జెమిని టీవీ 'శ్రీరస్తు..శుభమస్తు' శాటిలైట్‌ రైట్స్‌ను రూ.3కోట్లకు తీసుకుంది. ఒక విధంగా చెప్పాలంటే శాటిలైట్‌ రైట్స్‌తోనే ఈ చిత్రానికి పెట్టిన పెట్టుబడిలో సగం రికవరీ అయిందని ఫిల్మ్‌నగర్‌ సమాచారం. మొత్తానికి అల్లు అరవింద్‌ మేథస్సుకు హ్యాట్సాఫ్‌ చెప్పాలి. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ