అక్కినేని అఖిల్ తన రెండో చిత్రంగా హను రాఘవపూడితో సినిమా చేయనున్న విషయాన్ని స్వయంగా అఖిలే వెల్లడించాడు. ఈ చిత్రం పక్కా స్క్రిప్ట్ తయారవ్వడంలో అఖిల్, నాగార్జునల సూచనలు కూడా చాలా ఉన్నాయి. హను రాఘవపూడితో పాటు వీరు కూడా స్క్రిప్ట్‌ను రెడీ చేయడంలో తమ వంతు పాత్ర పోషించారు. దాంతో ఈ చిత్రం స్క్రిప్ట్ తుదిమెరుగులు దిద్దుకొని అద్బుతంగా వచ్చిందని విశ్వసనీయ సమాచారం. కాగా హను రాఘవపూడితో వరసగా రెండు చిత్రాలు తమకే చేయాలని 'కృష్ణగాడి వీరప్రేమగాథ' చిత్ర సమయంలోనే 14రీల్స్ సంస్ద అగ్రిమెంట్ చేసుకుంది. దీంతో అఖిల్- హనురాఘవపూడిల సినిమా సందిగ్దంలో పడింది. కాగా 14రీల్స్ సంస్ద వద్ద హను రాఘవపూడి డేట్స్‌తో పాటు హీరో నితిన్ డేట్స్ కూడా ఉన్నాయి. దాంతో హను రాఘవపూడి ఇటీవల అఖిల్ కోసం తయారుచేసిన స్క్రిప్ట్‌లో కొద్ది మార్పులు చేర్పులు చేసి నితిన్‌కు చెప్పాడని సమాచారం. ఈ స్క్రిప్ట్ అద్భుతంగా ఉండటంతో నితిన్ కూడా ఈ స్టోరికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది. ట్విస్ట్ ఏమిటంటే నితిన్, అఖిల్ క్లోజ్ ఫ్రెండ్స్ మాత్రమే కాదు.. అఖిల్ తొలిచిత్రం 'అఖిల్'కు నిర్మాత కూడా నితినే కావడం గమనార్హం.