Advertisementt

బాలయ్య కి కూడా కోపమొచ్చింది..!

Fri 12th Aug 2016 10:06 PM
balakrishna,devisri prasad,gautamiputrs satakarni,krish,balakrishna movies  బాలయ్య కి కూడా కోపమొచ్చింది..!
బాలయ్య కి కూడా కోపమొచ్చింది..!
Advertisement
Ads by CJ

బాలకృష్ణ నటిస్తోన్న 100 వ చిత్రం 'గౌతమీపుత్ర శాతకర్ణి' చిత్రం నుండి అర్దాంతరంగా వాకౌట్‌ చేసిన సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్‌పై బాలయ్య అభిమానులు తీవ్రంగా స్పందిస్తున్నారు. అటు ఎన్టీఆర్‌ 'జనతాగ్యారేజ్‌'తో పాటు చిరంజీవి 150వ చిత్రానికి కూడా సంగీతం అందిస్తున్న దేవిశ్రీ బాలయ్య ప్రాజెక్ట్‌ను వదులుకోవడంతో ఇది బాలయ్యను చిన్నచూపు చూసినట్లుగా, అవమానంగా బాలయ్య అభిమానులు దేవిశ్రీపై కారాలు మిరియాలు నూరుతున్నారు. ఇక ఈ విషయంలో బాలయ్య సైతం చాలా ఆగ్రహంగా ఉన్నాడని తెలుస్తోంది. దర్శకుడు చెప్పింది చేసుకుపోవడం తప్ప ఎందులోనూ వేలు పెట్టని, ఎవ్వరినీ కోప్పడని బాలయ్య.. దేవిశ్రీ విషయంలో మాత్రం చాలా సీరియస్‌ అయ్యాడంటున్నారు. దేవిశ్రీకి ఫోన్‌ చేసి మరీ తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడని కూడా సమాచారం. మొత్తానికి దేవిశ్రీని ఈ విషయంలో అందరూ తప్పుపడుతున్నారు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ