Advertisementt

ఇంకా కన్‌ఫ్యూజన్‌లోనే రవితేజ, నితిన్‌!

Fri 12th Aug 2016 06:40 PM
raviteja,nithiin,confusion,venu sriram,chakri  ఇంకా కన్‌ఫ్యూజన్‌లోనే రవితేజ, నితిన్‌!
ఇంకా కన్‌ఫ్యూజన్‌లోనే రవితేజ, నితిన్‌!
Advertisement
Ads by CJ

రవితేజ దాదాపు 8నెలలుగా ఖాళీగా ఉన్నాడు. వేణుశ్రీరామ్‌తో చేయాల్సిన 'ఎవడో ఒకడు', నూతన దర్శకుడు చక్రితో చేయాల్సిన 'రాబిన్‌హుడ్‌'.. చేస్తాడని వార్తలు వచ్చినా అవి కార్యరూపం దాల్చలేదు. ఈ రెండు చిత్రాలను రవితేజ రిజెక్ట్‌ చేశాడు. తాజాగా విక్రమ్‌సిరి అనే నూతన దర్శకునితో ఒక చిత్రం, దర్శకుడు బాబిలు కూడా లైన్‌లో ఉన్నారని సమాచారం. ఇక నితిన్‌ నటించిన 'అ...ఆ' చిత్రం విడుదలై దాదాపు మూడు నెలలు గడుస్తున్నా నితిన్‌ తాను నటించబోయే చిత్రం విషయంలో క్లారిటీ ఇవ్వలేదు. నితిన్‌ కోసం ఎదురుచూస్తున్న దర్శకుల జాబితా మాత్రం పెద్దదిగానే ఉంది. కిషోర్‌ తిరుమల, సంపత్‌నంది, హనురాఘవపూడి, విజయ్‌కుమార్‌ కొండా, సురేందర్‌రెడ్డిలు నితిన్‌ కోసం ఎదురుచూస్తున్నవారి లిస్ట్‌లో ఉన్నారు. కానీ నితిన్‌ మాత్రం ఇప్పటికీ తన తదుపరి చిత్రంపై క్లారిటీ ఇవ్వడంలేదు. 'అ...ఆ' సూపర్‌హిట్‌ అయినప్పటికీ నితిన్‌ ఎందుకు మౌనంగా ఉన్నాడనేది అర్దం కాని విషయం. మరి ఈ ఇద్దరు హీరోలు తమ మౌనాన్ని పక్కనపెట్టి తదుపరి చిత్రాలపై క్లారిటీ ఇస్తే వారి కెరీర్‌ ఊపందుకుంటుంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ