Advertisementt

నాగ్, అరవింద్..మరీ ఇంత చీప్ గానా..?!

Fri 12th Aug 2016 04:21 PM
nagarjuna,allu aravind,ts 09 en 9669,ts 09 en 9580,rto office  నాగ్, అరవింద్..మరీ ఇంత చీప్ గానా..?!
నాగ్, అరవింద్..మరీ ఇంత చీప్ గానా..?!
Advertisement
Ads by CJ

టాలీవుడ్ ఇండస్ట్రీలో నాగార్జున ఫ్యామిలీ ఇంకా అల్లు అరవింద్ ఫ్యామిలీ అంటే కోటీశ్వరులు కిందే లెక్క. అయితే ఇప్పుడు వీరు హాట్ టాపిక్ గా మారారు. నాగార్జున తాను చేస్తున్న 'ఓంనమో వెంకటేశాయ' సినిమా గురించి కాదు హైలెట్ అయ్యింది. ఇక అల్లు అరవింద్ కూడా తాను నిర్మించబోయే సినిమాల గురించి కాదు ఇప్పుడు హాట్ న్యూస్. ఈ న్యూస్ కి ఒక ప్రత్యేకత వుంది. అదేమిటంటే నాగార్జున ఇంకా అల్లు అరవింద్ కార్లు కొనుగోలు చేశారు. వారు కారు కొంటే న్యూస్ ఏమిటి అనుకుంటున్నారా.. అదేనండి అసలు మజా!.. వారు కార్లు కొన్నారంటే అవేవో బిఎం డబ్ల్యు అనో లేక ఆడి కార్లో అని అనుకునేరు. అవికాదు వారు కొన్నది. నాగార్జున, అల్లు అరవింద్ గార్లు సాదా సీదా కార్లు కొనుగోలు చేశారు. నాగార్జున ఇన్నోవా కారు కొనగా అల్లు అరవింద్ షిఫ్ట్ డిజైర్ కొన్నారు. ఇక వీరిద్దరూ తమ కార్ రిజిస్ట్రేషన్ కోసం ఖైరతాబాద్ ఆర్టీఓ ఆఫీస్ కి వెళ్లారు . ఇక అక్కడ వీరిని చూడడానికి అభిమానులు, అక్కడి సిబ్బంది ఎగబడ్డారు. అయితే నాగార్జున తన ఇన్నోవా కారుకి టీఎస్‌09ఈఎన్‌ 9669 నెంబర్ తీసుకోగా... అల్లుఅరవింద్ తన కారుకి టీఎస్‌ 09 ఈఎన్‌ 9580 నెంబర్‌ను తీసుకున్నారు. ఇండస్ట్రీలో నెంబర్ 1 పొజిషన్ లో వున్న వీరిద్దరూ ఇలా తక్కువ రేట్ల కారులు కొనడం ఇప్పుడు హాట్ టాపిక్ గా అందరూ చెప్పుకుంటున్నారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ