Advertisementt

పిల్లాడితో నయన్ లిప్ లాక్ యవ్వారంపై వివాదం!

Fri 12th Aug 2016 01:36 PM
nayanthara,lip lock,thirunaal movie,nayanthara lip lock with child  పిల్లాడితో నయన్ లిప్ లాక్ యవ్వారంపై వివాదం!
పిల్లాడితో నయన్ లిప్ లాక్ యవ్వారంపై వివాదం!
Advertisement
Ads by CJ

తన ప్రేమ విషయంలో ఎన్ని సార్లు వివాదాలు రేగుతున్నా తన సినిమా కెరీర్ ను మాత్రం చాలా పద్ధతి ప్రకారం ప్లాన్ చేసుకుంటూ పోతుంది సౌత్ఇండియన్ బ్యూటీ నయనతార. కానీ ఈ మధ్య ఆమె నటించిన తిరునాళ్ చిత్రం సరిగ్గా ఆడక ఓ పక్క తెగ ఫీలై పోతుంటే, మరో పక్క ఈ సినిమాలో ఉన్న ఓ సన్నివేశం మాత్రం ఆమెను తీవ్రంగా ఇబ్బందుల పాలుచేస్తుంది. అదేంటంటే తిరునాళ్ లోని ఓ సన్నివేశంలో స్కూల్ పిల్లలకు చాక్లెట్స్ లాంటి గిఫ్ట్స్ ఇస్తూ పిల్లలందరినీ తమ బుగ్గపై ముద్దులు పెట్టించుకుంటుంది. అందరూ అలాగే బుగ్గపై పెడుతుంటే ఓ కొంటె పిల్లగాడు మాత్రం ఆమె అందమైన ముఖాన్ని తమ చేతుల్లోకి తీసుకొంటాడు. ఆ తర్వాత వాడి పెదాలను ఆమె పెదవులపై ఆనించినట్లుగా కిస్ చేయడంతో నయనతార ఒక్కసారిగా బిత్తర పోయినట్లుగా ముఖం పెడుతుంది. ఇక్కడ వచ్చింది అసలు తంటా. ఈ విషయం ఇప్పుడు తమిళనాడులో వివాదం రేపుతుంది. పిల్లలు ఓ హీరోయిన్ ను లిప్ లాక్ చేస్తున్న సన్నివేశాన్ని తొలగించాలంటూ పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నారు. ఈ విషయంలో చైల్డ్ రైట్ యాక్టివిస్టులు, మహిళా సంఘాలు తీవ్రంగా ఫైట్ చేస్తున్నాయి.  

ఈ విషయంపై నయనతార స్పందిస్తూ ఆ పిల్లగాడు అలా చేస్తాడని ముందు తనకు ఏ మాత్రం తెలియదని, అనుకోకుండా జరగడంతో అలా సన్నివేశాన్ని కంటిన్యూ చేశారని చెప్తుందీ భామ. సరే ఆ విధంగా కూడా మూవీ బాగా ప్రచారమై, ప్రత్యేకంగా ఆ సన్నివేశం కోసమే ఆ సినిమా థియేటర్లలో జనాలు కళకళలాడుతున్నారని తెలుస్తుంది.   

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ