Advertisementt

ఇలియానాకి ఇంకొన్ని గంటలే..!

Fri 12th Aug 2016 01:18 PM
ileana,rustom,ileana funture,ileana movies,tollywood,bollywood  ఇలియానాకి ఇంకొన్ని గంటలే..!
ఇలియానాకి ఇంకొన్ని గంటలే..!
Advertisement
Ads by CJ

గోవాబ్యూటీ... దక్షిణాదిలో టాప్‌ హీరోయిన్‌గా కెరీర్‌ పీక్స్‌లో ఉన్న సమయంలో దక్షిణాదిని ముఖ్యంగా టాలీవుడ్‌ను ఏలుతున్న సమయంలో బాలీవుడ్‌పై మోజుతో అక్కడ అడుగుపెట్టింది. కాగా ఈ నడుము సుందరికి ఇప్పటివరకు బాలీవుడ్‌లో క్రేజ్‌ రాలేదు. ఒకటిరెండు చిత్రాలు హిట్టయినా ఆ అదృష్టం ఆమె ఖాతాలో పడలేదు. అవకాశాలు లేక దక్షిణాదికి తిరిగి వద్దామా? లేకపోతే బాలీవుడ్‌లోనే ఉందామా? అనే డైలమాలో ఆమె ఉంది. కాగా ప్రస్తుతం ఆమె చేతిలో ఇప్పుడు ఒకే ఒక్క చిత్రం ఉంది. అదే 'రుస్తుం'. అక్షయ్‌కుమార్‌ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో ఇలియానా హీరోయిన్‌గా నటించింది. ఎక్స్‌పోజింగ్‌తో పాటు పారితోషికం విషయంలో కూడా ఆమె ఉదారంగానే వ్యవహరిస్తున్నా బాలీవుడ్‌ దర్శకనిర్మాతలు మాత్రం ఆమెకు చాన్స్‌ ఇవ్వడం లేదు. కాగా ఆమె నటించిన 'రుస్తుం' చిత్రం రేపు అంటే 12వ తేదీన విడుదలకు సిద్దమవుతోంది. ఈ చిత్రమైనా మంచి విజయం సాధించి, ఆ క్రెడిట్‌ తన ఖాతాలో కూడా పడుతుందేమో అనే ఆశతో ఇల్లీబేబీ ఉంది. మొత్తానికి ఆమె బాలీవుడ్‌ భవిష్యత్తు రేపు తెలియనుంది.ఈ చిత్రం కూడా తనకు పేరు తేకపోతే మరలా దక్షిణాదే ఆమెకు దిక్కుగా కనిపిస్తోంది. మొత్తానికి టాలీవుడ్‌లో తొలిసారి కోటిరూపాయల రెమ్యూనరేషన్‌ తీసుకున్న ఈ భామ దూరపు కొండలు నునుపు అనే విషయాన్ని మర్చిపోయి ఇలా తంటాలు పడుతోంది. మరి ఆమె భవితవ్యం రేపు డిసైడ్‌ అవుతుంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ