Advertisementt

రామ్ చరణ్ లుక్ కీ..డేట్ ఫిక్స్..!!

Thu 11th Aug 2016 08:19 PM
ram charan,dhruva,mega power star,tanioruvan,surendra reddy  రామ్ చరణ్ లుక్ కీ..డేట్ ఫిక్స్..!!
రామ్ చరణ్ లుక్ కీ..డేట్ ఫిక్స్..!!
Advertisement
Ads by CJ

రామ్ చరణ్ - సురేంద్ర రెడ్డి కాంబినేషలో 'ధ్రువ' చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. తమిళ సినిమా 'తని ఒరువన్' కి రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాని దసరాకి విడుదల చేయడానికి ఈ చిత్ర నిర్మాతలు ప్లాన్ చేసున్నారు. అయితే 'ధ్రువ' ఫస్ట్ లుక్ ని ఆగష్టు 15 న స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలతో విడుదల చెయ్యాలని ఈ చిత్ర యూనిట్ భావిస్తోందట. ఇక స్వాతంత్య్ర దినోత్సవం రోజున మెగా అభిమానులకు పండగే అన్నమాట. ఈ సినిమాని సురేంద్ర రెడ్డి తనదైన స్టైల్ లో తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రం చార్మినార్ పరిసర ప్రాంతాలలో షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమాలో రామ్ చరణ్ కి జోడిగా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్న విషయం తెలిసిందే. రామ్ చరణ్ హీరో గా ఈ సినిమా చేస్తూనే.. తన తండ్రి 150 చిత్రానికి ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్న విషయమూ తెలిసిందే. మరి చాలా కాలం తర్వాత చరణ్ సినిమాకి సంబంధించి ఆగష్టు 15న లుక్ ఎలా ఉండబోతుంది? చరణ్ ఈ లుక్ తో మెగా ఫ్యాన్స్ నే కాక ప్రేక్షకులందరిని మెప్పించ గలడా!. చూద్దాం!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ