ఈమధ్య సరైన హిట్‌లేని నాగచైతన్య ప్రస్తుతం రెండు చిత్రాల్లో నటిస్తున్నాడు. గౌతమ్‌మీనన్ దర్శకత్వంలో 'సాహసం శ్వాసగా సాగిపో' చిత్రం షూటింగ్ పూర్తయినా విడుదల మాత్రం ఎప్పటినుండో వాయిదాలు పడుతూ వస్తోంది. ఇప్పటికే ఈ చిత్రానికి గౌతమ్ అనేక సార్లు రిలీజ్ డేట్‌ను ప్రకటించినా అవి కన్‌ఫర్మ్‌కాలేదు. ఇంతలో నాగచైతన్య నటిస్తున్న మరోచిత్రం మలయాళ 'ప్రేమమ్' రీమేక్ షూటింగ్ కూడా పూర్తి చేసుకొంది. ఈ రెండు చిత్రాలకు కనీసం నెలైనా గ్యాప్ ఉండేలా చూసుకోవాలని చైతూ భావిస్తున్నాడు. ఈ రెండు చిత్రాలలో ఒకటి సూపర్‌హిట్ అయినా తన కెరీర్ మరలా ఊపందుకుంటుందనేది ఆయన ఆశ. కాగా ఇటీవలే 'ప్రేమమ్' చిత్రం ఫస్ట్‌లుక్ కూడా విడుదలైంది.ఈ చిత్రం ఆడియోను ఈ నెలలోనే విడుదల చేసి సెప్టెంబర్ 9న చిత్రాన్ని రిలీజ్ చేస్తామని ఈ చిత్ర దర్శకనిర్మాతలు ప్రకటించారు. మరోవైపు గౌతమ్‌మీనన్ తన 'సాహసం శ్వాసగా సాగిపో' చిత్రం కూడా సెప్టెంబర్ 9న విడుదలకానుందని ట్వీట్ చేశాడు. దీంతో అక్కినేని అభిమానులు సందిగ్దంలో పడిపోయారు. ఈ రెండు చిత్రాలకు సెప్టెంబర్9న రిలీజ్ అని తన ప్రమేయం లేకుండా అనౌన్స్ చేసినందుకు చైతు ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఎవరు ఎన్ని చెప్పినా రిలీజ్ డేట్స్ ప్రకటించినా వాటిని నమ్మవద్దని, తాను స్వయంగా ప్రకటిస్తేనే ఫైనల్ అని నమ్మాలని ఆయన ట్వీట్ చేశాడు. సో.. ప్రస్తుతం చైతూ తన దర్శకనిర్మాతల విషయంలో చాలా కోపంగా ఉన్నాడని ఫిల్మ్‌నగర్ వాసులు చర్చించుకుంటున్నారు.