Advertisementt

హాలీవుడ్ కి, బాలీవుడ్ కీ చుక్కలు చూపిస్తోంది!

Thu 11th Aug 2016 04:25 PM
priyanka chopra,hollywood,bollywood,producers,bollywood actress priyanka chopra  హాలీవుడ్ కి, బాలీవుడ్ కీ చుక్కలు చూపిస్తోంది!
హాలీవుడ్ కి, బాలీవుడ్ కీ చుక్కలు చూపిస్తోంది!
Advertisement
Ads by CJ

బాలీవుడ్ లో మెప్పించి హాలీవుడ్ లో ప్రవేశించి అక్కడి పరిశ్రమనే తన చుట్టూతా తిప్పుకుంటున్న భామా మణి ప్రియాంక చోప్రా. కళ్ళు జిగేల్ మనిపించే అందంతో అద్భుతమైన నటనతో హాలీవుడ్ నే ఏలుతున్న నారీ ప్రియాంక. క్వాంటికో సిరీస్ తో హాలీవుడ్ లో ప్రవేశించి బేవాచ్ మూవీతో హాలీవుడ్ లో తమకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని పదిలపరచుకుంది అందాల భామ ప్రియాంక. 

ప్రస్తుతం బేవాచ్ మూవీ ప్రమోషన్ లో బిజీగా వుంది ప్రియాంక. అమెరికాలో ప్రియాంకకు వస్తున్న ఇమేజ్, క్రేజ్ ను చూసి హాలీవుడ్ దర్శక నిర్మాతలు  ఆ అమ్మడిని తమ సినిమాలో నటించమని తెగ బ్రతిమిలాడుతున్నారట. అయితే ఈ అమ్మనీమణి మాత్రం వారి ఆఫర్లను సున్నితంగానే తిరస్కరిస్తున్నట్లు టాక్. ఇప్పటికే ఈమెగారి చుట్టూ ఆరు ఏడుగురు వరకు హాలీవుడ్ కు చెందిన దర్శకులు తిరిగి నిరుత్సాహాన్ని చవి చూసినట్లు తెలుస్తుంది. 

అమెరికా టెలివిజన్ 'ప్రాజెక్టు రన్ వే' అనే ప్యాషన్ రియాలిటీ షోలో పాల్గొంటున్న ప్రియాంక మాట్లాడుతూ 'తానెప్పుడూ ఒకే మూస కథలలో నటించదలుచుకోవడం లేదని, ఎప్పటికప్పుడు నూతనంగా ఉండే వాటి కోసమే వెంపర్లాడుతున్నాను' అని సెలవిచ్చింది. తాను ఏక కాలంలో ఒకే సినిమా చేస్తానని పలు వాటిని ఒప్పుకోవడం ద్వారా క్రియేటివ్ ఫ్రస్ట్రేషన్ కు గురవుతున్నానన్నట్లు వివరించింది. కాగా తాను ఇప్పుడు 70 ఎమ్ ఎమ్ హాట్ గాళ్ ని అనీ, తాను నటించే సినిమాలు గానీ, సిరీస్ లు గానీ 70 ఎమ్ ఎమ్ థియేటర్లలోనే చూస్తానని తెగ ఫోజులు పోతుంది ఈ అందాల ముద్దుగుమ్మ. ఇకపోతే తాను హాలీవుడ్ లో నటించనని అక్కడి వారిని సున్నతంగా తిరస్కరించి ఇంటికి పంపుతుంది సరే. నిన్నగాక మొన్న బాలీవుడ్ అగ్రశ్రేణి దర్శకులైన సంజయ్ లీలా భన్సాలీ, కరణ్ జోహార్, జొయా, పర్హాన్ అక్తర్ ల సినిమాలకు ఎందుకు నో చెప్పినట్టు. అది ఆమెకే తెలియాలి. ప్రియాంక ఆలోచన ఏంటో ఎవ్వరికీ అర్థం కాక అటు హాలీవుడ్ కి, ఇటు బాలీవుడ్ కి దిమ్మ తిరుగుతుంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ