బాలీవుడ్ స్టార్స్‌లో టాప్ ప్లేస్ ఎవరిదయ్యా అంటే ఎవరైనా ఠక్కున సల్మాన్ పేరే చెబుతారు. ఆయన తాజాగా నటించిన 'సుల్తాన్' కూడా ఇప్పటికే విడుదలై నెల రోజులు గడిచినా కూడా కలెక్షన్లు స్టడీగానే ఉన్నాయి. ఈ చిత్రం కేవలం మనదేశంలోనే 300కోట్లను సాధించింది. ఇది ఒక రికార్డు. ఎందుకంటే ఇప్పటివరకు బాలీవుడ్‌లో కేవలం ఇండియాలోనే 300కోట్లు దాటిన చిత్రాలుగా మూడు ఉన్నాయి. అవి 'పీకే, భజరంగీ భాయిజన్, సుల్తాన్'లు మాత్రమే. ఈ మూడింటిలో రెండు 300కోట్ల చిత్రాలతో సల్మాన్ మరోసారి బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటాడు. ఇక 'సుల్తాన్' ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 500కోట్లకు పైగానే వసూలు చేసింది.ఇక ఈ చిత్రంలో నటించిన అనుష్కశర్మ కూడా 'సుల్తాన్' చిత్రంతో రికార్డ్ క్రియేట్ చేసింది. కేవలం ఇండియాలోనే 300కోట్లు దాటిన మూడు చిత్రాలలో రెండింటిలో అనుష్కశర్మనే హీరోయిన్. ఆమె 'పీకే' చిత్రంలో అమీర్‌ఖాన్ సరసన, 'సుల్తాన్'లో సల్మాన్ సరసన నటించి ఈ రికార్డును సొంతం చేసుకుంది.