టాలీవుడ్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు.. మురుగుదాస్ దర్శకత్వం వహిస్తున్న సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. మహేష్ కు సంబంధించి ఏ వేడుకైనా అది అభిమానులకు సంబరమే. అలాంటిది తాజాగా మహేష్ నటిస్తున్న మురుగదాస్ చిత్రానికి సంబంధించిన ఏ లుక్ కూడా బయటకు విడుదల చేయకపోవడంపై అభిమానులు కాస్త నిరాశకు లోనయ్యారు. కనీసం పోస్టర్ గానీ, ఆ సినిమా తాలూకూ టీజర్ గట్రా ఏమీ మహేష్ పుట్టినరోజు చూడలేకపోవడం పట్ల మహేష్ అభిమానులు గుర్రుగా ఉన్నారు.
మురుగదాస్ సినిమా షూటింగ్ లో తలమునకలై ఉన్న సమయంలో కూడా మహేష్ కుటుంబాన్ని ఏమాత్రం నిర్లక్ష్యం చేయలేదు. పుట్టినరోజు నాడు చాలా సాదాసీదాగా గడిపారు మహేష్. మంగళవారం ఉదయం తండ్రి కృష్ణగారి వద్ద ఆశీర్వాదం తీసుకున్నారు. మిగలిన రోజంతా కూడా భార్య నమ్రత, కుమారుడు గౌతమ్, కూతురు సితారలతో గడపడానికే వెచ్చించారు. తన పుట్టిన రోజు సందర్భాన్ని పురస్కరించుకొని మురుగదాస్ వద్ద రెండు రోజులు సెలవు తీసుకొని మరీ కుటుంబంతో గడపడానికే వెచ్చించారు. ప్రత్యేకంగా ఫలక్ నమా ప్యాలెస్ కు వెళ్ళి కుటుంబంతో చాలా సరదాగా పిల్లలతో ఆడుతూ పాడుతూ గడపడం విశేషం. తండ్రి పుట్టినరోజు నాడు పిల్లలు, కుటుంబ సభ్యులతో గడపడం కంటే ఎవరికైనా ఏం కావాలి. ఫలక్ నమా ఫ్యాలెస్ లో మంచి మంచి నోరూరించే రుచులను మహేష్ తింటూ పిల్లలకు తినిపిస్తూ ఆనందంగా గడిపారు. సాధారణంగా ప్రస్తుత కాలంలో పుట్టినరోజు అంటేనే నానా హంగామా చేస్తూ పార్టీలు, వేడుకలు షికార్లతో గడిపేస్తారు నేటి తరం యువతీ యువకులు. వారికి మార్గదర్శకంగా ఉండేలా కుటుంబ సభ్యులతో గడపడం వెరైటీగా ఉంది కదూ.