ఒకవైపు సీనియర్‌స్టార్స్ అయిన చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్‌లకు హీరోయిన్లు దొరక్క ఇబ్బందులు పడుతున్నారనేది వాస్తవం. అయినా కూడా మన సీనియర్ స్టార్స్ మాత్రం కొత్తవారినైనా, అప్‌కమింగ్ హీరోయిన్లనైనా పెట్టుకొని రొమాన్స్ విషయంలో మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. వెంకటేష్ విషయానికి వస్తే ఆయన గతంలో 'నాగవల్లి' చిత్రంలో నలుగురు హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన కిషోర్‌తిరుమల దర్శకత్వంలో చేయనున్న 'ఆడాళ్లు.. మీకు జోహార్లు' చిత్రంలో అరడజను మంది భామలు నటించనున్నారని సమాచారం. ఇక నాగార్జున విషయానికి వస్తే ఆయన నటించిన 'సోగ్గాడే చిన్నినాయనా' చిత్రంలో ఐదుగురు భామలతో రొమాన్స్ చేశాడు. ఇక బాలకృష్ణ నటించిన ఈమధ్యకాలంలోని చిత్రాలు చూస్తే ఆయన కూడా ప్రతి సినిమాలోనూ ఇద్దరు ముగ్గురుభామలతో రొమాన్స్ తప్పనిసరి అంటున్నాడు. మొత్తానికి మన సీనియర్లు హీరోయిన్ల విషయంలో, రొమాన్స్ విషయంలో కుర్రస్టార్ హీరోలను దాటిపోతున్నారు.