చిరంజీవి 150 వ సినిమా గురుంచి రోజుకో న్యూస్ బయటికి వస్తుంది. మొన్నటి వరకు హీరోయిన్ విషయంలో తెగ టెన్షన్ పడ్డ 150వ సినిమా యూనిట్.. ఎలాగో కాజల్ ని ఫైనల్ చేశారు. ఇక తర్వాత ఈ సినిమా టైటిల్ కి సంబందించి రోజుకో వార్త హల్ చల్ చేసింది. అయినా టైటిల్ ఫిక్స్ అయ్యింది లేదు. చిరంజీవి తల్లితండ్రులు గా చలపతి రావు, అన్నపూర్ణమ్మ నటిస్తున్నారని నిన్నగాక మొన్న ఓ న్యూస్ హైలెట్ అయ్యింది. ఇక తాజాగా ఇప్పుడు కొరియోగ్రఫీకి సంబంధించి మరో న్యూస్ వెలుగులోకి వచ్చింది. దేవిశ్రీ సంగీతం అందిస్తున్న చిరు 150 వ సినిమాలో ప్రభుదేవా ఒక పాటకి డాన్స్ కంపోజ్ చెయ్యబోతున్నాడనేది లేటెస్ట్ న్యూస్. చిరంజీవి పాత సినిమాల్లో ప్రభుదేవా కంపోజ్ చేసిన డాన్స్ లకు ఇప్పటికీ స్టేజ్ మీద మంచి క్రేజ్ వుంది. అందుకే చిరు కూడా తన 150వ సినిమాలో ఒక సాంగ్ కంపోజ్ చేయమని ప్రభుదేవాని అడగగా అతను ఆనందం గా ఒప్పుకున్నాడని సమాచారం. అయితే వీరిద్దరూ మొన్నామధ్య దేవిశ్రీ లైవ్ షో లో కలిసినప్పుడు ఈ విషయం మాట్లాడుకున్నారని టాక్. ఇక 150 సినిమాలో ప్రభుదేవా ఒక సాంగ్ కొరియోగ్రఫీ చేస్తున్నాడు అంటే ఇక ఆ డాన్స్ ని చిరు ఏ రేంజ్ లో అదరగొడతాడో.. ఊహించుకోండి.