పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా చిత్రాన్ని డాలీ డైరెక్షన్ లో చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాకి టైటిల్ గా 'కడప కింగ్' అని అనుకుంటున్నారని టాక్. ఈ చిత్రాన్ని పవన్ కళ్యాణ్ ఫ్రెండ్ శరత్ మరార్ నిర్మిస్తున్నాడు. త్వరలోనే సెట్స్ మీదకెళ్లనున్న ఈ సినిమాకి సంబంధించి ఒక ఆసక్తికర విషయం బయటికి వచ్చింది. ఈ సినిమా స్టోరీ లీక్ అయ్యిందనేది ఈ వార్త సారాంశం. ఈ చిత్రం అంతా ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో నడుస్తుందని... ఈ చిత్రం లో పవన్ ఫ్యాక్షన్ లీడర్ గా కనిపిస్తాడని సమాచారం. ఇక పవన్ యుక్త వయస్సులో వున్నప్పుడు ఒక అమ్మాయిని ప్రేమిస్తాడని... అయితే ఆ ప్రేమ విఫలం కావడంతో ఇక పెళ్లి లేకుండా బ్రహ్మచారిగానే ఉండిపోదామని డిసైడ్ అయ్యాక... మరో అమ్మాయి పవన్ కళ్యాణ్ జీవితంలోకి ప్రవేశిస్తుందని... ఆమె పవన్ ఆలోచనల్ని మారుస్తుందని... ఇదే ఈ సినిమా కథ అని ప్రచారం జరుగుతుంది. అయితే ఈ చిత్ర కథకి అజిత్ తమిళంలో హీరోగా నటించిన 'వీరం' కథకి దగ్గర పోలికలు ఉండడంతో... అంతా పవన్ ఈ స్టోరీతో సినిమా తీస్తే..ఆల్రెడీ తెలుగు లో కూడా ఈ మూవీ వచ్చింది కాబట్టి మూవీ అంతగా ఆడదేమో అని అనుకుంటున్నారు. మరి పవన్ కొత్త సినిమా కథ ఇదేనా.. లేక ఇది ఉత్త రూమరేనా అనేది మాత్రం తెలియాల్సి వుంది.