Advertisementt

మరో హాట్ భామ కూడా రీ..ఎంట్రీ!

Wed 10th Aug 2016 01:15 PM
rambha,rambha re entry,rambha reentry with horror and thriller movie,ramya krishna,nagma  మరో హాట్ భామ కూడా రీ..ఎంట్రీ!
మరో హాట్ భామ కూడా రీ..ఎంట్రీ!
Advertisement
Ads by CJ

నిన్నటితరం హీరోయిన్లలో ఆనాడే బికినీ సీన్లకు, హాట్‌హాట్‌ ఎక్స్‌పోజింగ్‌కు తెరతీసిన వారిలో ముగ్గురి పేర్లు ప్రముఖంగా చెప్పుకోవాలి. వారే నగ్మా, రమ్యకృష్ణ, రంభ. వీరిలో నగ్మా, రమ్యకృష్ణలు ప్రస్తుతం సెకండ్‌ ఇన్నింగ్స్‌ను స్టార్ట్‌ చేశారు. సెకండ్‌ ఇన్నింగ్స్‌లో నగ్మా పరిస్దితి మాత్రం ఇబ్బందులోనే సాగి, ప్రస్తుతం మౌనంగ ఉండగా, రమ్యకృష్ణ మాత్రం మంచి మంచి క్యారెక్టర్స్‌లో మెప్పిస్తూనే ఉంది. ఇక 'ఆ ఒక్కటీ అడక్కు' చిత్రం ద్వారా టాలీవుడ్‌కు పరిచయమై అందరు స్టార్‌హీరోల సరసన నటించిన రంభ చాలా కాలం కిందటే వివాహం చేసుకొని ఓ బిడ్డకు తల్లి కూడా అయింది. కాగా ప్రస్తుతం ఈ అమ్మడు కూడా తన సెకండ్‌ ఇన్నింగ్స్‌ను స్టార్ట్‌ చేసి, తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టిందని సమాచారం. త్వరలో తమిళ, తెలుగు భాషల్లో ఓ హర్రర్‌ అండ్‌ థ్రిల్లర్‌ మూవీ ద్వారా వెండితెరపై మరలా అడుగుపెట్టనుంది. ఈ చిత్రం లేడీ ఓరియంటెడ్‌ మూవీగా తెరకెక్కనుందని సమాచారం. మరి తన రీఎంట్రీతో ఆమె మరలా ఫామ్‌లోకి వచ్చి ప్రేక్షకులను అలరిస్తుందా? లేదా? అనేది తెలియాల్సివుంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ