కాజల్ అగర్వాల్.... ఈ చందమామ నిన్నటివరకు వరుసగా యంగ్ స్టార్స్ చిత్రాలలో నటిస్తూ తన సత్తా చాటుకుంటూ వస్తోంది. కానీ 'సర్దార్‌గబ్బర్‌సింగ్, బ్రహ్మోత్సవం' చిత్రాలు డిజాస్టర్స్‌గా నిలవడంతో ఈమెకు అవకాశాలు తగ్గాయి. దీంతో ఆమె ప్రస్తుతం ఏ చిత్రానికైనా తాను అడిగిన రెమ్యూనరేషన్ ఇస్తే ఒప్పేసుకుంటోంది. తమిళ, హిందీ భాషల్లోనూ ఆమె పరిస్థితి ఇదేనని చెప్పవచ్చు. కాగా ఈ అమ్మడు చివరకు సీనియర్‌స్టార్ అయిన మెగాస్టార్ చిరంజీవి సరసన నటిస్తోంది. ఇలా సీనియర్ స్టార్స్ సరసన నటిస్తే కుర్ర స్టార్‌హీరోలతో అవకాశాలు తగ్గుతాయని భావించి చాలామంది స్టార్ హీరోయిన్లు ఈ చిత్రంలో నటించడానికి నో చెప్పిన నేపధ్యంలో ఆమె చిరు సినిమాకు ఓకే చెప్పడం అందరినీ ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇక ఆమె కొరటాలశివ- ఎన్టీఆర్‌ల కాంబినేషన్‌లో రూపొందుతున్న 'జనతాగ్యారేజ్' చిత్రంలో తన కెరీర్‌లో మొదటిసారి స్పెషల్ సాంగ్ చేయనుంది. తమిళంలో ఆమె ప్రస్తుతం యువహీరో జీవాతో పాటు.. స్టార్ హీరో అజిత్ తాజా చిత్రంలో హీరోయిన్‌గా చేస్తోంది. అజిత్ చిత్రంలో మొదట శృతిహాసన్‌ను అనుకున్నప్పటికీ పలు కారణాల వల్ల ఆస్దానంలో కాజల్ వచ్చి చేరింది. ఇక తెలుగులో త్వరలో ఆమె దర్శకుడు తేజ దర్శకత్వంలో మరో చిత్రం చేస్తోంది. ఇవ్వన్నీ చూస్తే ఎలాగోలా కాజల్ బిజీగానే ఉందని అర్దమవుతోంది.