కోవర్టుగా ఉంటానంటూ తెరపైకి వచ్చి నక్సలైట్ల సమాచారాన్ని అందించినట్లే అందించి తమ విలాస సామ్రాజ్యాన్ని విస్తరించుకున్న గ్యాంగ్ స్టర్ నయిూమ్. బెదిరింపుల నుండి మొదలు పెట్టి భూదందాలు, హత్యలు, అత్యాచారాలు ఒక్కటేమిటి చేయకూడనివన్నీ చేశాడు ఆ ఒక్కడు. పటోళ్ళ గోవర్థన్ రెడ్డి, సాంబశివుడు, సీనియర్ ఐపీయస్ అధికారి వ్యాస్, రాములు వంటి వారి హత్యల్లో ప్రధాన సూత్రధారి నయిూమ్. అలా నయిూమ్ గొడవ పోనీయిలే బ్రతకనీయ్ అని వదిలేసిన తెరాస నాయకత్వాన్ని కూడా భయపెట్టే స్థాయికి చేరింది. నాలుగు జిల్లాల్లో నయిూమ్ ఇష్టానుసారం ఆగడాలు పెంచి నాయకులను గడగడలాడించసాగాడు.
నయిూమ్, నిజమాబాద్ లోని ఓ నాయకుడిని బెదిరించడంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అటువైపు నుంచి నయిూమ్ కోసం వెతకులాట మొదలైంది. దానికి తోడు శంషాబాద్, మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాలలోని తెరాస నాయకులను కూడా బెదిరించడం మొదలైంది. దీంతో వీరి ఆగడాలకు చలించపోయిన తెరాస పెద్దే ప్రత్యక్షంగా కలగజేసుకొని సీనియర్ పోలీసు అధికారులతో మంతనాలు జరిపారు. 'మీరేం చేస్తారో నాకు అనవసరం. ఆ నయిూమ్ జీవించి ఉండకూడదు' అని ఆ పెద్ద నేేతే భరోసా ఇచ్చారు. దాంతో అధికారగణం ఆపరేషన్ నయిూమ్ ను ప్రారంభించి అతడుంటున్న సెల్ ఫోన్ టవర్ ను ట్రేస్ చేశారు. తర్వాత మెల్లమెల్లగా నివాసముంటున్న ఇంటిని చుట్టుముట్టారు. అంతలో నిరంతరం భయంతో, ఎప్పుడేం జరుగుతుందోనన్న మెలకువతో ఉండే గ్యాంగ్ స్టర్ నయిూమ్ కి అనుమానం వచ్చింది. దాంతో పారిపోదామని బయటికొచ్చి కారెక్కబోతుండగా అక్కడే పొంచి ఉన్న పోలీసు దళం నయిూమ్ ను ఎన్ కౌంటర్ చేసేసింది. భలే థ్రిల్ గా ఉంది కదూ ఈ ఎన్ కౌంటర్. ట్విస్టు ఏంటంటే ఈ బడా రౌడీ నయిూమ్ బయటికి ఎక్కడికి వెళ్ళాలన్నా ఏ మాత్రం అనుమానం రాకుండా ఉండటం కోసమో, విలాసాల కోసమే గానీ పక్కన దండిగా ఆడవారు మాత్రం ఉండేవారంట. ఆడవాళ్ళు లేకుండా అస్సలు అడుగు బయట పడేది కాదట నయిూమ్ కు. చిత్రం బాగుంది. సినిమాగా మలిస్తే మంచి విషాధాంతం అవుతుంది. అన్ని ఎలిమెంట్స్ పెట్టి గట్టి సినిమా తీస్తే సూపర్ హిట్ అవుతుంది. ఎందుకంటే యథార్ధ ఘటనలతో తీసిన ఏ చిత్రమైనా హిట్ కాకుండా పోయిన దాఖలాలు టాలీవుడ్ కు లేవు.