మునికోటి మీకు గుర్తున్నాడా? గత ఏడాది ఆగస్ట్ 9 న తిరుపతిలో కాంగ్రెస్ నిర్వహించిన ర్యాలీలో స్పేషల్ స్టేటస్ ని డిమాండ్ చేస్తూ, అతడు ఆత్మాహుతి చేసుకున్నాడు. ఈరోజు(ఆగష్టు 9) తో అతడు చనిపోయి సరిగ్గా ఏడాది పూర్తయింది. గత కొంతకాలంగా ప్రత్యేక హోదా కోసం గొంతు చించుకొని ఏపీ రాజకీయ పార్టీలు ... ఏపీ ఎంపిలు, ఎమ్యేల్యే లు మునికోటి త్యాగాన్ని పూర్తిగా మరచిపోయారు. అయితే జనసేన అద్యక్షుడు పవణ్ కళ్యాణ్ మాత్రం ఈ విషయాన్నీ మరచిపోలేదు .మునికోటి మొదటి వర్ధంతిని పురస్కరించుకొని నిన్న(ఆగష్టు 8) పవన్ కళ్యాణ్ తన పార్టీ ట్రెజరర్ .. తనకు సన్నిహితుడు అయిన రాఘవయ్య ఆధ్వర్యంలో 'జనసేన' టీం ను హైదరాబాద్ నుండి తిరుపతికి పంపించారట. ఈరోజు వారు మునికోటి కు నివాళులు అర్పించి ...అతడి కుటుంబ సభ్యులతో మాట్లాడి ... పవన్ కళ్యాణ్ జనసేన తరుపున 5 లక్షలు ఆర్ధిక సాయం ఆయన కుటుంబానికి అందించారట. ఈ సందర్భంగా మునికోటి సోదరుడు మాట్లాడుతూ ... అధికార పార్టీ టిడిపి పై, అటు కాంగ్రెస్ పార్టీ పై ఆగ్రహం వ్యక్తం చేసాడు. తన సోదరుడు చనిపోయిన తరువాత టిడిపి ప్రభుత్వం 5 లక్షల సహాయం ప్రకటించగా... కాంగ్రెస్ పార్టీ 2 లక్షల ఆర్ధిక సహాయాన్ని ప్రకటించిందని.. కానీ ఇప్పటి వరకు వారు తమకు నయా పైసా కూడా అందజేయలేదు అని ఆవేదన వ్యక్తం చేశాడు. మునికోటి ఆశయం నెరవేరకపోగా... అతని మరణం కారణంగా అ కుటుంబానికి తీవ్ర అన్యాయం జరిగింది అని అతడు తెలిపాడు. కష్ట సమయంలో తన అన్న కుటుంబాన్ని పవన్ కళ్యాణ్ గారు ఆదుకోవటం పట్ల అతను కృతజ్ఞతలు తెలుపుకున్నాడు . మొత్తానికి ప్రత్యేక హోదా కు ఆత్మబలిదానం చేసిన మునికోటి త్యాగాన్ని ఇంతగా గుర్తుపెట్టుకున్న పవన్.. ఏ.పి కి హ్యాండ్ ఇచ్చిన కేంద్రం పై కూడా పోరాడటానికి త్వరలో ఒక పక్కా కార్యాచరణని రూపొందించుకొని రంగంలోకి దిగితే బాగుంటుందని రాజకీయ వర్గాలు, ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.