ప్రముఖ నటి, డాన్సర్ జ్యోతిలక్ష్మి ఈ రోజు ఉదయం (మంగళవారం) అనారోగ్యం తో కన్ను మూశారు. 300 లకు పైగా సినిమాల్లో నటించిన ఆవిడ దక్షిణాదితో పాటు హిందీ చిత్రాల్లో కూడా నటించింది. ఆరోజుల్లో ఎన్టీఆర్, కృష్ణ, ఏఎన్నార్ సినిమాల్లో జ్యోతిలక్ష్మి స్పెషల్ సాంగ్ కంపల్సరీగా ఉండేది. ఈమె ఐటెం సాంగ్ సినిమాల్లో ఉంటుంది అంటే ఆ సినిమా చూడడానికి జనాలు బారులు తీరేవారు అంటే అతిశయోక్తి కాదు. అయితే జ్యోతిలక్ష్మి సాంగ్ వుంది అంటే సినిమా హిట్ అనే సెంటిమెంట్ కూడా 80 వ దశకం లో ఉండేది. ఆమె పెళ్లి చేసుకున్న తర్వాత ఐటెం సాంగ్ లకు దూరమైపోయింది. అంతే కాకుండా ఆమె మీడియా కి కూడా దొరకకుండా చాలా రోజుల పాటు అజ్ఞాత వాసం గడిపింది. తర్వాత టీవీల్లో కొన్నిచోట్ల కనిపించినా కూడా పెద్దగా ఇంపార్టెన్స్ లేని పాత్రల్లో కనిపించింది. అయితే ఆమె ఈ మధ్య కేన్సర్ బారిన పడి... ఆరోగ్య పరం గా ఇబ్బంది పడడమే కాకుండా.. ఆర్థికంగా కూడా ఆమె చాల బాధపడిందని సమాచారం. ఇక ఈ రోజు ఉదయం ఆవిడ చెన్నై లోని స్వగృహం లో తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయింది. ఆమె మృతికి దక్షిణాది సినీ పరిశ్రమ ప్రగాఢ సంతాపం తెలియజేసింది.