Advertisementt

రజినీకాంత్.. సునీల్ ఒక్కటేనా..!!

Tue 09th Aug 2016 06:08 PM
rajinikanth,sunil,sunil interview,mukhamukhi with sunil,jakkanna  రజినీకాంత్.. సునీల్ ఒక్కటేనా..!!
రజినీకాంత్.. సునీల్ ఒక్కటేనా..!!
Advertisement
Ads by CJ

అవునండి ఈ మాటన్నది ఎవరో కాదు ప్రముఖ కమెడియన్ కం హీరో సునీల్. ఆయన ఈ మధ్య ఒక ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఇలా కామెంట్ చేశాడు. ఛానెల్ వాళ్ళు అడిగిన కొన్నిప్రశ్నలకు ఆయనకి చాలా చిరాకుని, కోపాన్ని తెప్పించాయి. అందుకే ఇరిటేషన్ లో ఇలా అనేసుంటాడని... ఇలా రజినీకాంత్ ని అనాలని కాదని సునీల్ సన్నిహితులు చెబుతున్నారు. అయితే మీరు హీరో అవ్వాలని అసలు ఎలా అనుకున్నారు అని.... మీ మొహాన్ని అద్దం లో ఎప్పుడయినా చూసుకున్నారా అన్నప్రశ్నకు సునీల్ స్పందిస్తూ రజినీకాంత్ ఏమన్నా అందంగా వుంటారా అని... మరి ఆయన హీరో అవ్వగా లేంది నేను అయితే వచ్చిందా అని నోరుజారాడు. అంతే కాకుండా మీరు నన్ను ఇబ్బంది పెట్టడానికే ఇలా ప్రశ్నలు వేస్తున్నారా.. చంపేస్తాను అని వార్నింగ్ కూడా ఇచ్చాడు. ఇక తర్వాత పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ తరుపున మీరు పోటీ చేస్తారా అని యాంకర్ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ నాకు పవన్ కళ్యాణ్ అంటే ఇష్టమని... ఎన్నికల్లో మాత్రం పోటీ చెయ్యనని.... ఆయన మంచి పని ఏది చేయమన్నా చేసి పెడతానని... నాకు ఏ పదవులు వద్దని చెప్పుకొచ్చాడు. అంతే కాకుండా నేను హీరోగా చేస్తూనే కమెడియన్ గా కూడా కొనసాగుతున్నానని గుర్తు చేసాడు!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ