Advertisementt

వరుణ్ సందేశ్ పెళ్ళి ముహూర్తం ఖరారు!

Tue 09th Aug 2016 05:30 PM
varun sandesh,vithika sheru,marriage,bheemavaram,varun sandesh marriage  వరుణ్ సందేశ్ పెళ్ళి ముహూర్తం ఖరారు!
వరుణ్ సందేశ్ పెళ్ళి ముహూర్తం ఖరారు!
Advertisement
Ads by CJ

'హ్యాపీడేస్' చిత్రం ద్వారా తెలుగు పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపును తెచ్చుకున్న వరుణ్ సందేశ్ 'కొత్త బంగారు లోకం'తో పరిశ్రమలో హీరోగా స్థిరపడిపోయాడు. అయితే ఈ మధ్య కాలంలో ఓ మంచి హిట్ చిత్రం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు హీరో వరుణ్ సందేశ్. ఓ ప్రక్క సినిమా ప్రయత్నాలు జరుపుతూనే మరో పక్క వ్యక్తిగత జీవితాన్ని కూడా ఏ మాత్రం నిర్లక్ష్యం చేయలేదు. 

'ప్రేమ ఇష్క్ కాదల్' చిత్రంలో హీరోయిన్ గా నటించిన 'వితిక శేరు'ను వరుణ్ సందేశ్ ప్రేమించి గత సంవత్సరం డిసెంబర్ లో నిశ్చితార్థం కూడా జరుపుకున్న విషయం తెలిసిందే. కాగా నిశ్చితార్థం జరుపుకున్న చాలా కాలానికి వీరి వివాహం ఆగస్టు 18వ తేదీన జరుగనున్నట్లు ముహూర్తం ఖరారైంది.  అయితే ఈ జంట వివాహం భీమవరంలో జరుపుకొని హైదరాబాద్ లో భారీ రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నట్లు అందిన సమాచారాన్ని బట్టి తెలుస్తుంది.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ