Advertisementt

తాప్సీ కూడా పడిపోయింది..!

Tue 09th Aug 2016 05:06 PM
taapsee pannu,saqib saleem,tapsee affair with saqib saleem,tapsee and saqib affair  తాప్సీ కూడా పడిపోయింది..!
తాప్సీ కూడా పడిపోయింది..!
Advertisement
Ads by CJ

సొట్ట బుగ్గల సుందరి తాప్సీకి  టాలీవుడ్ లో అవకాశాలు వచ్చినప్పటికీ విజయాలు మాత్రం దక్కలేదు. దాంతో బాలీవుడ్ కు సర్దుకున్న ఈ పంజాబీ భామ అక్కడ అమిత బిజీగా మారింది.  అమితాబ్ బచ్చన్ సినిమా పింక్ లో ఓ ప్రత్యేక పాత్రలో నటిస్తూ మరో నాలుగు సినిమాలు చేతిలో పట్టుకొని కూర్చుంది. అంతే కాకుండా ఈ మధ్య కాస్త ప్రేమలో పడినట్టుగా కూడా బాలీవుడ్ లో వార్తలు పొక్కుతున్నాయి. అసలు ఆ వార్తలు జనాల వరకు పాకడానికి కారణం ఉంది. తాప్సీ ఎక్కడికి వెళ్ళినా అక్కడ సాకిబ్ అనే ఓ హీరోని తెగ పొగిడేస్తుందట. అదీ అలా ఇలా కాదు. 'సాకిబ్ చాలా మంచి వ్యక్తి. తనతో గడుపుతుంటే టైమే తెలియడం లేదు. వారితో సంభాషిస్తుంటే నాకు ఎక్కడలేని ఉత్సాహం ఉరకలు వేస్తోంది' అంటూ ఎవరు అడక్క పోయినా చెప్పేస్తుందట. అదీ విషయం. సాకిబ్ మీద ఎంత ప్రేమ మైకం కమ్మకపోతే తాప్సీకి నోటి నుండి ఆ మాటలు వస్తాయి చెప్పండి. 

ఇంకా  తాప్సీ పుట్టినరోజు సందర్భంగా ఇద్దరూ చెట్టపట్టాలేసుకొని గోవాలో నాలుగు రోజులు గడిపారన్న వార్త కూడా బాలీవుడ్ లో షికారు చేస్తుంది. మొత్తానికి సొట్టబుగ్గల సుందరి అమితంగా ప్రేమలో మునిగినట్టు తెలుస్తుంది. ప్రేమమైకంలో ఉన్న తాప్సీని ఈ విషయం గురించి మీడియా వారు అడిగితే 'సాకిబ్ నా అభిమాన కో స్టార్. అంతే .... మీరు దాన్ని ఎలా అర్థం చేసుకుంటారో నాకు అనవసరం' అంటూ పెదవి బిగపట్టిందట. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ