కృష్ణ వంశీ - సందీప్ కిషన్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న 'నక్షత్రం' సినిమా గురించి ఒక హాట్ న్యూస్ బయటికి వచ్చింది. ఈ సినిమాకి సంబంధించి వచ్చిన ఆ హాట్ న్యూస్ ఏమిటంటే 'నక్షత్రం' సినిమాలో మెగా హీరో సాయి ధరమ్ తేజ్ గెస్ట్ రోల్ లో నటించబోతున్నాడట . ఈ న్యూస్ కూడా దర్శకుడు కృష్ణ వంశీ ద్వారానే రివీల్ అయినట్లుగా తెలుస్తుంది. కృష్ణ వంశీ నే సోషల్ మీడియాలో తెలిపినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో సాయిధరమ్ తేజ్ పోలీస్ పాత్రలో కనిపిస్తాడని అంటున్నాడు కృష్ణ వంశీ. సందీప్ కిషన్, సాయిధరమ్ తేజ్ లు మంచి ఫ్రెండ్స్ అనే సంగతి 'ఒక్క అమ్మాయి తప్ప' ఆడియో ఫంక్షన్ కి సాయి అటెండ్ అయినప్పుడే తెలిసింది. తన ఫ్రెండ్ కోసం, ఇంకా కృష్ణ వంశీ సినిమాలో ఛాన్స్ రావడం వంటివి సాయిధరమ్ తో ఈ సినిమాలో గెస్ట్ రోల్ చేసేలా చేశాయి. సాయి ధరమ్ పెద్ద హీరో అయితే కాదు కానీ అతనికున్న మెగా హీరో క్వాలిఫికేషన్ మాత్రం ఈ సినిమాకి ఎంతో కొంత లాభం చేకూర్చడం ఖాయం. అందుకే కృష్ణ వంశీ ఏరి కోరి మరి సాయి ని ఈ మూవీ లో నటింపచేసుకుంటున్నాడని అనుకుంటున్నారు. ఇక ఈ సినిమాలో సందీప్ కిషన్ కి జంట గా రెజీనా హీరోయిన్ గా చేస్తున్న విషయం తెలిసిందే.