తమిళమే అతి ప్రాచీనమైన మొనగాడు భాష అని తక్కిన భారతీయ భాషలన్నీ అసలు ప్రాచీన భాషకు ఉండాల్సిన అర్హతలు లేవని తమిళ భాష పిపాసుల వాదన, ఆవేదన. అలా అనుకుంటున్న వాళ్ళందరినీ చెంప చెళ్ళు మనిపించేలా తీర్పు చెప్పింది మద్రాసు హైకోర్టు ఈరోజు. అసలు తమిళీయుల బాధ ఎంత అంటే తమిళమే అతి ప్రాచీనమైనదని, మిగతా తెలుగుతో పాటు కన్నడం, మళయాళం, ఒరియా వంటి భాషలేటికీ ప్రాచీనతకు చెందిన అర్హతలు లేవని గత ఏడు సంవత్సరాల క్రితం మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అప్పటి నుండి వాదోపవాదాలు జరుగుతూ తెలుగుతో పాటు మిగతా భాషలు వారు కూడా మాది గొప్ప అంటే మాది గొప్ప అంటూ వాదోపవాదాలు జరిగాయి. చివరకు హైకోర్టు తేల్చిన విషయం ఏంటంటే తెలుగు భాషకు ప్రాచీన హోదాకు చెందిన అర్హతలన్నీ పుష్కలంగా ఉన్నాయని బల్ల గుద్ది మరీ చెప్పింది. దీంతో తమిళ భాషా ప్రేమికుల చెంప చెళ్ళుమంది.
అసలు ఒక భాష ప్రాచీనమైనదని.. మరో భాషకు ఆ అర్హత లేదని.. అతి ప్రేమికుల బడాయిలే కానీ, మనిషి, వారి సమాజం వీటిని బట్టే భాష ఆధారపడి ఉంటుందన్న సంగతి అమిత భాషా ప్రేమికులైన తమిళులకు ఆ మాత్రం ఇంకిత జ్ఢానం లేదేమో. సరే ఇప్పటికైనా తెలుస్తుందిలే.