రామ్‌చరణ్‌కు మాస్ ప్రేక్షకుల్లో ఎంతటి ఇమేజ్ ఉందో అందరికీ తెలిసిందే. అందుకే చరణ్ నటించిన 'ఆరెంజ్' వంటి కొత్తగా, డిఫరెంట్ జోనర్‌లో సినిమా చేసినా..అది డిజాస్టర్‌గానే నిలిచింది. దీంతో రామ్‌చరణ్ కూడా తన ప్లస్‌పాయింట్ అయిన మాస్ అండ్ యాక్షన్ చిత్రాలే చేస్తూ వచ్చాడు. ఆయనతో చిత్రాలు తీసిన దర్శకులు కూడా అదే పంథాలో చరణ్ తో చిత్రాలు చేస్తూ వచ్చారు. రెండేళ్ల కిందటి వరకు ఆయన కెరీర్ అలానే కొనసాగింది. అయితే రోజులన్నీ మనవే అనుకుంటే ఎలా? రెండేళ్ల నుంచి విధి ఆయనకు అడ్డం తిరిగింది. ఆయన చేసిన మాస్ మసాల చిత్రాలు బాగా దెబ్బతినడంతో ఆయన కెరీర్ గాడి తప్పింది. దాంతో చరణ్ ప్రయోగం చేస్తూ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా కృష్ణవంశీ డైరెక్షన్‌లో చేసిన 'గోవిండుడు అందరివాడేలే' చిత్రం చరణ్ ఆశించిన ఫలితం ఇవ్వనప్పటికీ ఫ్యామిలీ ప్రేక్షకులకు చరణ్ ను చేరువ చేసింది. ఈ చిత్రంలో ఆయన నటన అహా, ఓహో అనిపించకపోయినా ఫర్వాలేదు.. కష్టపడ్డాడు అనిపించింది. కానీ ఆ తర్వాత మరలా మూసలోకి వెళ్లి చేసిన 'బ్రూస్‌లీ' దారుణమైన ఫలితాన్ని అందించింది. అందుకే చరణ్ ప్రస్తుతం చేస్తున్న తమిళ రీమేక్ 'ధృవ' చిత్రంతో మరోసారి ప్రయోగం చేస్తున్నాడు. ఆ తర్వాత చేసే సుకుమార్ చిత్రం కూడా డిఫరెంట్‌గానే ఉంటుందని సమాచారం. వాస్తవానికి ఓవర్‌సీస్‌లో చరణ్‌కు ఉన్న ఇమేజ్ చాలా తక్కువ. ఓవర్‌సీస్‌లో కేవలం విభిన్న చిత్రాలను మాత్రమే ఆదిరిస్తారు. కానీ చరణ్ చేసే మూసదోరణి చిత్రాలను అక్కడ చూడరు. ఓవర్‌సీస్‌లో ఆయనకు ఒక్క మిలియన్ డాలర్ల చిత్రం కూడా లేదు. చరణ్ ఇప్పటివరకు ఓవర్‌సీస్‌లో ఎక్కువ వసూలు సాధించింది కేవలం 4కోట్లే. కానీ ఇప్పుడు నటిస్తున్న 'ధృవ' చిత్రం హక్కులు 5కోట్లు పలికాయని సమాచారం. ఎలాగైనా ఓవర్‌సీస్ మార్కెట్ పెంచుకోవాలని ఆశిస్తున్న చరణ్ కల నెరవేరుతుందా? లేదా? అనేది వేచిచూడాల్సిన అంశం.