ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్, మోహన్‌లాల్ నటిస్తున్న'జనతాగ్యారేజ్' చిత్రం సెప్టెంబర్ 2న విడుదల కానున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం కోసం కొరటాల ఓ మంచి ఎత్తుగడ వేశాడు. ఈ చిత్రానికి ఆయన రెండు క్లైమాక్స్‌లను తెరకెక్కిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. తెలుగులో ఎన్టీఆర్ ఇమేజ్‌కు తగ్గట్లుగా ఓ క్లైమాక్స్, మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్‌కు అక్కడ ఉన్న ఇమేజ్‌కు తగ్గట్లుగా మరో క్లైమాక్స్‌ను కొరటాల తెరకెక్కిస్తున్నాడు. వాస్తవానికి ఇలా రెండు క్లైమాక్స్‌లను తీయడం ఇదే మొదటిసారి కాదు. మణిరత్నం తన 'దళపతి' చిత్రానికి తమిళ, మలయాళ భాషల్లో రెండు డిఫరెంట్ క్లైమాక్స్‌లను తీసి... ఆనాడే ఈ తరహా చిత్రీకరణకు బీజం వేశాడు. ఇక గౌతమ్‌మీనన్ కూడా 'ఏమాయచేశావే, ఘర్షణ' చిత్రాలకు తమిళ, తెలుగు భాషల్లో రెండు క్లైమాక్స్‌లు తీశాడు. ఈ రెండు చిత్రాలకు తమిళం ముగింపులో విషాధం పెడితే, తెలుగులో మాత్రం సంతోషకరమైన ముగింపునిచ్చాడు. ఇప్పుడు అదే బాటను కొరటాల ఫాలో అవుతున్నాడు. మొత్తానికి ఈ రకమైన ప్రయోగాన్ని కొరటాల విజయవంతం చేయగలుగుతాడా? లేదా? అనేది వేచిచూడాల్సిందే.